Honda Activa e: ఒక్క సారి ఛార్జ్ చేస్తే 102కి.మీ... రిమూవబుల్ బ్యాటరీతో హోండా యాక్టివా ఈవీ స్కూటర్ లాంఛ్.. ధర ఎంతంటే ?

Honda Activa Electric Scooter: Activa E స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే, 1.5kWh స్వాప్ చేయగల డ్యూయల్ బ్యాటరీలను కంపెనీ ఇందులో డిజైన్ చేసింది.

Update: 2024-11-27 08:06 GMT

Honda Activa e

Honda Activa e: హోండా ఎట్టకేలకు కొత్త యాక్టివా ఎలక్ట్రిక్‌ వెహికిల్ ను విడుదల చేసింది. కంపెనీ దీనికి Activa E అని పేరు పెట్టింది. ఇది భారతీయ మార్కెట్లో కంపెనీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కూడా. కంపెనీ దీనిని రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఇందులో స్టాండర్డ్ , సింక్ డుయో ఉన్నాయి. అయితే దీని ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దీని ధరలు జనవరి 1 నుంచి వెల్లడికానున్నాయి. ఈ రోజు నుంచి దీని బుకింగ్ కూడా ప్రారంభం కానుంది. డెలివరీ ఫిబ్రవరి 2025 నుండి ప్రారంభమవుతుంది. అన్నింటిలో మొదటిది ఢిల్లీ, ముంబై, బెంగళూరులో విక్రయించడం జరుగుతుంది.

Activa E స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే, 1.5kWh స్వాప్ చేయగల డ్యూయల్ బ్యాటరీలను కంపెనీ ఇందులో డిజైన్ చేసింది.. ఈ రెండు బ్యాటరీలు ఫుల్ ఛార్జింగ్‌పై 102కిమీల రేంజ్‌ను ఇస్తాయని పేర్కొంది. ఈ బ్యాటరీలను హోండా మొబైల్ పవర్ ప్యాక్ ఇ అని పేర్కొంది. వీటిని హోండా పవర్ ప్యాక్ ఎనర్జీ ఇండియా అభివృద్ధి చేసి నిర్వహించింది. బెంగళూరు, ఢిల్లీలో బ్యాటరీ ఎక్స్ చేంజ్ స్టేషన్లను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ స్టేషన్లు త్వరలో ముంబైలో ఏర్పాటు చేయబడతాయి. ఈ బ్యాటరీలు 6kW ఫిక్స్‌డ్ మాగ్నెట్ సింక్రోనస్ ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తాయి, ఇది 22Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎకాన్, స్టాండర్డ్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఇందులో పొందుపరచబడ్డాయి. దీని గరిష్ట వేగం గంటకు 80 కి.మీ. 0 నుండి 60 కిమీ/గం వేగాన్ని 7.3 సెకన్లలో అందుకోవచ్చు.

ఇప్పుడు Activa E ఫీచర్ల గురించి మాట్లాడితే.. ఇది Honda RoadSync Duo స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ కనెక్టివిటీని కలిగి ఉంది. దీని ద్వారా మీరు అనేక ఫీచర్లను ఆపరేట్ చేయగలరు. ఇది 7-అంగుళాల TFT స్క్రీన్‌ను కలిగి ఉంది. స్క్రీన్ నావిగేషన్‌కు మద్దతు ఇస్తుంది. హ్యాండిల్‌బార్‌పై ఉంచిన టోగుల్ స్విచ్ సహాయంతో ఇది కంట్రోల్ అవుతుంది. ఇందులో డే అండ్ నైట్ మోడ్‌లు కూడా ఉన్నాయి. ఇది స్మార్ట్ ఫైండ్, స్మార్ట్ సేఫ్, స్మార్ట్ అన్‌లాక్, స్మార్ట్ స్టార్ట్ వంటి హోండా హెచ్-స్మార్ట్ కీ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.

హార్డ్‌వేర్ గురించి మాట్లాడితే.. ఇది 12-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. ఇవి టెలిస్కోపిక్ ఫోర్కులు, డ్యూయల్ స్ప్రింగ్‌ల ద్వారా సస్పెండ్ చేయబడ్డాయి. అయితే డిస్క్-డ్రమ్ కలయిక ద్వారా బ్రేకింగ్‌ను నియంత్రించవచ్చు. పెర్ల్ షాలో బ్లూ, పెరల్ మిస్టీ వైట్, పెరల్ సెరినిటీ బ్లూ, మ్యాట్ ఫాగీ సిల్వర్ మెటాలిక్, పెరల్ ఇగ్నియస్ బ్లాక్ వంటి 4 కలర్ ఆప్షన్‌లలో కంపెనీ దీనిని విడుదల చేసింది. భారత మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఏథర్ ఎనర్జీ వంటి కంపెనీల మోడల్స్‌తో పోటీపడనుంది.

Tags:    

Similar News