Ola Electric Scooters: 'ఓలా' నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లు.. ధర 39 వేలే! సింగిల్‌ ఛార్జ్‌పై 146 కిమీ ప్రయాణం

Ola Electric Scooters: దేశీయ ప్రముఖ విద్యుత్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' కొత్త స్కూటర్‌లను లాంచ్ చేసింది.

Update: 2024-11-27 02:30 GMT

Ola Electric Scooters: 'ఓలా' నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లు.. ధర 39 వేలే! సింగిల్‌ ఛార్జ్‌పై 146 కిమీ ప్రయాణం

Ola Electric Scooters: దేశీయ ప్రముఖ విద్యుత్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' కొత్త స్కూటర్‌లను లాంచ్ చేసింది. గిగ్‌, ఎస్‌1 జడ్‌ శ్రేణిలో కొత్త స్కూటర్లను మంగళవారం లాంచ్‌ చేసింది. గిగ్‌ శ్రేణిలో ఓలా గిగ్‌, ఓలా గిగ్‌ ప్లస్.. ఎస్‌1 జడ్‌ శ్రేణిలో ఎస్‌1 జడ్‌, ఎస్‌1 జడ్‌ ప్లస్ స్కూటర్‌లను రిలీజ్ చేసింది. దాంతో ఓలా ఎలక్ట్రిక్‌ తన వాహన శ్రేణిని మరింత విస్తరించింది. ఈ స్కూటర్‌ల ధరలు రూ.39,999 నుంచి రూ.64,999 వరకు ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ కొత్త స్కూటర్‌ల ఫుల్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.

ఓలా గిగ్‌ స్కూటర్‌ ధర రూ.39,999గా.. ఓలా గిగ్‌ ప్లస్ ధర రూ.49,999గా కంపెనీ నిర్ణయించింది. ఎస్‌1 జడ్‌ స్కూటర్‌ ధర రూ.59,999గా.. ఎస్‌1 జడ్‌ ప్లస్ ధర రూ.64,999గా ఉంది. రూ.499 చెల్లించి ఈరోజు నుంచే ఈ స్కూటర్‌లను బుక్‌ చేసుకోవచ్చు. గిగ్‌ స్కూటర్‌లు 2025 ఏప్రిల్‌ నుంచి, ఎస్‌1 జడ్‌ స్కూటర్‌లు 2025 మే నుంచి అందుబాటులో ఉంటాయి. గిగ్‌ వర్కర్ల కోసం ఓలా గిగ్‌ను కంపెనీ తీసుకొచ్చింది. తక్కువ దూరాల ప్రయాణాల కోసం దీన్ని రిలీజ్ చేసింది. ఇందులో 1.5 KWh రిమూవబుల్‌ బ్యాటరీ ఉండగా.. సింగిల్‌ ఛార్జ్‌పై 112 కిమీ ప్రయాణించొచ్చు. ఈ స్కూటర్ టాప్‌ స్పీడ్ 25kmph.

సుదూర ప్రయాణాలు చేసే గిగ్‌ వర్కర్ల కోసం ఓలా గిగ్‌ ప్లస్ స్కూటర్‌ను రిలీజ్ చేసింది. 1.5kWh డ్యూయల్‌ బ్యాటరీ ప్యాక్‌తో వస్తోన్న ఈ స్కూటర్.. సింగిల్‌ ఛార్జ్‌తో 81 కిమీ రేంజ్ ఇస్తుంది. రెండు బ్యాటరీలతో కలిపి 157 కిమీ వెళ్లొచ్చు. ఈ స్కూటర్ టాప్‌ స్పీడ్‌ 45kmph. ఓలా గిగ్‌ స్కూటర్లు రెంటల్స్‌ కోసం కూడా అందుబాటులో ఉంటాయి. వ్యక్తిగత అవసరాల కోసం తీసుకొచ్చిన ఓలా ఎస్‌1 జడ్‌లో 1.5kWh చొప్పున రెండు బ్యాటరీలు ఉంటాయి. రెండు బ్యాటరీలతో కలిపి 146 కిమీ రేంజ్‌ ఇస్తుంది. దీని టాప్ స్పీడ్ 70 kmph. వ్యక్తిగత, కమర్షియల్‌ వినియోగం కోసం రూపొందించిన ఓలా ఎస్‌1 జడ్‌+ కూడా 1.5kWh డ్యూయల్‌ బ్యాటరీతో వస్తోంది. 146 కిమీ ప్రయాణం ఇస్తుండగా.. టాప్‌ స్పీడ్‌ 70 kmph. జడ్‌ స్కూటర్‌లలో ఫిజికల్‌ కీ, ఎల్‌సీడీ డిస్‌ ఉంటుంది.

Tags:    

Similar News