Tata Motors: టాటా నుంచి మార్కెట్లోకి వస్తున్న 3 కొత్త కార్లు.. పిచ్చెక్కించే ఫీచర్స్‌తో..!

Tata Motors: దేశంలో ఎక్కువ మంది ఆదరణ చూపించే కార్లలో టాటా మోటర్స్‌ ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-11-26 06:54 GMT

Tata Motors: టాటా నుంచి మార్కెట్లోకి వస్తున్న 3 కొత్త కార్లు.. పిచ్చెక్కించే ఫీచర్స్‌తో..!

Tata Motors: దేశంలో ఎక్కువ మంది ఆదరణ చూపించే కార్లలో టాటా మోటర్స్‌ ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భద్రతకు పెద్దపీట వేసే టాటా మోటార్స్‌కు ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తుంటారు. 2024లో మార్కెట్లోకి పలు ఇంట్రెస్టింగ్ కార్లను తీసుకొచ్చింది. ఈ ఏడాది ఆల్ట్రోజ్‌ రేసర్‌. నెక్సాన్‌ సీఎన్‌జీ, ఎస్‌యూవీ కూపే కర్వ్‌ వంటి కార్లతో ఆటోమొబైల్‌ లవర్స్‌ని అట్రాక్ట్‌ చేసిన టాటా మోటార్స్‌ వచ్చే ఏడాది మరో మూడు కొత్త మోడల్స్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇంతకీ వచ్చే ఏడాది టాటా నుంచి వస్తున్న ఆ కొత్త కార్లు ఏంటి.? వాటిలో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

* వచ్చే ఏడాది టాటా నుంచి వస్తున్న కార్లలో టాటా హారియర్‌ ఈవీ ఒకటి. ఎలక్ట్రిక్‌ వేరియంట్‌లో మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీగా ఈ కారును తీసుకొస్తున్నారు. ఇప్టపికే ఈ కారును మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించారు. వచ్చే ఏడాది కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ఈ ఎలక్ట్రిక్‌ కారులో అత్యంత శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇక్కసారి ఛార్జ్‌ చేస్తే 600 కి.మీల రేంజ్‌ను ఇవ్వనుందని సమాచారం. త్వరలోనే ఈ కారుకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

* టాటా నుంచి వస్తోన్న మరో కారు టాటా సియెర్రా. ఇప్పటికే ఈ కారును మెబిలిటీ ఎక్స్‌షోలో ప్రదర్శించగా మంచి ఆదరణ లభించింది. వచ్చే ఏడాది మధ్యలో ఈ కార్ల ఉత్పత్తిని ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఆకర్షణీయమైన ఫీచర్లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

* ఇదిలా ఉంటే టాటా సియొర్రా ఈవీ కూడా రానుంది. వచ్చే ఏడాది మొదట్లో సియెర్రా SUVని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వేరియంట్​తో పాటు పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో రానుంది. ఈ కారు ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లో పవర్‌ ఫుల్ బ్యాటరీని ఇవ్వనున్నారు. ఒక్కసారి చార్జ్‌ చేస్తే ఏకంగా 500 కి.మీల రేంజ్‌ను అందిస్తుందని తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News