కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపూడి గాంధీ: ఇరువర్గాల మధ్యఘర్షణ, ఉద్రిక్తత

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి తన అనుచరులతో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి పై అరికెపూడి గాంధీ అనుచరులు కోడిగుడ్లు, టమాటలతో దాడికి దిగారు. అ బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్ణణ చోటు చేసుకుంది.

Update: 2024-09-12 07:20 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి తన అనుచరులతో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి పై అరికెపూడి గాంధీ అనుచరులు కోడిగుడ్లు, టమాటలతో దాడికి దిగారు. అ బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్ణణ చోటు చేసుకుంది.

అసలేం జరిగింది?

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ లో ఉన్నారని రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో ప్రకటించారు. అందుకే తనకు పీఏసీ ఛైర్మన్ పదవిని ఇచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ లో ఉన్నానని గాంధీ ప్రకటించినందున ఆయన ఇంటికి తాను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందతో కలిసి సెప్టెంబర్ 12న ఉదయం 11 గంటలకు వస్తానని చెప్పారు. గాంధీ ఇంటిపై బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి ఆయనను బీఆర్ఎస్ కార్యాలయానికి తీసుకువచ్చి మీడియాతో మాట్లాడతానని ప్రకటించారు. ఈ సవాల్ కు అరికెపూడి గాంధీ కూడా స్పందించారు.

కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత

 కౌశిక్ రెడ్డి సవాల్ కు అరికెపూడి గాంధీ కూడా అంతేస్థాయిలో స్పందించారు. 11 గంటలకు వస్తానని చెప్పి తన ఇంటికి రానందున తానే 12 గంటలకు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని గాంధీ మీడియాకు చెప్పారు. మధ్యాహ్నం 12 గంటలకు తన ఇంటి నుండి కౌశిక్ రెడ్డి నివాసానికి అనుచరులతో కలిసి ఆయన వెళ్లారు. కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకోగానే గేట్లు దూకి కొందరు కోడిగుడ్లు, టమాటలతో దాడికి దిగారు. రాళ్లు విసిరారు. కౌశిక్ రెడ్డి అనుచరులు, బీఆర్ఎస్ శ్రేణులు కూడా ప్రతిఘటించారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. అరికెపూడి గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంట్లో చేరి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరువర్గాలు పరస్పరం దాడికి దిగాయి. ఇరువర్గాలను పోలీసులు అడ్డుకున్నాయి. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి.

కౌశిక్ రెడ్డి ఇంటి ముందే కూర్చున్న గాంధీ

కౌశిక్ రెడ్డి ఇంటి బయటకు వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడే తాను ఇక్కడి నుంచి వెళ్తానని అరికెపూడి గాంధీ చెప్పారు. కౌశిక్ రెడ్డి ఇంటి ముందు కూర్చొన్నారు. ఒకానొకదశలో గాంధీ కౌశిక్ రెడ్డి ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆయనను నిలువరించారు. దీంతో ఆయన అక్కడే కూర్చొన్నారు.

గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు

కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అరికెపూడి గాంధీని అదుపులోకి తీసుకొని ఆయనను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అయితే ఈ సమయంలో గాంధీ అనుచరులు పోలీస్ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీస్ వాహనానికి అడ్డుగా ఉన్న గాంధీ అనుచరులను తప్పించి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

Full View


Tags:    

Similar News