
India Firm: ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని భారతీయ ఔషధ కంపెనీ గోదాముపై శనివారం రష్యా మిస్సైల్ దాడి చేసింది. కుసుమ్ అనే కంపెనీకి చెందిన గోదాముపై ఈ దాడి జరిగిందని ఢిల్లీలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం వెల్లడించింది. రష్యా కావాలనే ఈ భారతీయ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటుందని ఆరోపించింది. పిల్లలు, వ్రుద్ధుల కోసం ఔషధాలు నిల్వ చేసిన గోదాములపై ఇలా దాడులు చేస్తోందని విమర్శలు చేసింది. భారత్ తో స్నేహం ఉందని చెప్పే రష్యా కావాలనే ఇలా దాడులు చేయడం ఎంతరకు సమంజసం అని ఎక్స్ లో ప్రశ్నిస్తూ పోస్ట్ చేసింది.
అంతకముందు ఉక్రెయిన్ లోని బ్రిటన్ రాయబారి మారిన హారిస్ దాడిని ధ్రువీకరించారు. రష్యా డ్రోన్ల దాడిలో ఔషధాల గోదాము పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్ తోపాటు 29 దేశాల్లో తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని కుసుమ్ హెల్త్ కేర్ వెబ్ సైట్లో పేర్కొంది.