Bungee Jump: భార్యకు విడాకులు.. ఆనందంతో బంగీ జంప్.. కట్ చేస్తే హాస్పిటల్ బెడ్..
Bungee Jump: భాగస్వామి నుంచి విడాకులు తీసుకోవడం అంటే అదో విషాద ఘటనగా ఉండేది.
Bungee Jump: భాగస్వామి నుంచి విడాకులు తీసుకోవడం అంటే అదో విషాద ఘటనగా ఉండేది. అయితే ఇది ఒకప్పటి మాట..విడాకులు తీసుకొని భర్త నుంచి విడిపోవడం, లేదా భార్య నుంచి వేరుగా వెళ్లడం అనేది ఇవాల్టి రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. విడాకులను తీసుకోవడం కూడా ఒక అకేషన్ గా నేటి యువత సెలబ్రేట్ చేస్తోంది. చెన్నైకు చెందిన ఓ మహిళ తన భర్త నుంచి విడిపోయిన తర్వాత...డిప్రెషన్ కు గురి కాకుండా విడాకుల ఫోటోషూట్ చేసింది. ఈ తతంగం సోషల్ మీడియాలో వైరల్ కాగా..ఇలాంటి ఘటనే ఒకటి బ్రెజిల్ లో జరిగింది.
భార్య నుంచి విడాకులు రావడంతో భర్త ఫ్రీ బర్డ్ అయ్యానంటూ ఆనందం పడుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే ఆ సెలబ్రేషన్స్ అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే...బ్రెజిల్ కు చెందిన రాఫెల్ డోస్ తోస్టా తన వ్యక్తిగత కారణాలతో భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇక పెళ్లి జోలికి వెళ్లకుండా జీవితాన్ని ఎంజాయ్ గా గడపాలని డిసైడ్ చేసుకున్న తోస్టా బంగీ జంప్ చేసి తన అవధులు లేని ఆనందాన్ని ప్రపంచానికి చూపించాలనుకున్నాడు.
ఇందుకోసం అతడు బ్రెజిల్ లోని కాంపో మాగ్రోలో బ్రిడ్జ్ స్వింగ్ లో పాల్గొనడానికి వెళ్లాడు. 70 అడుగుల ఎత్తు నుంచి బంగీ జంప్ చేస్తుండగా మధ్యలో తాడు తెగిపోయింది. బాగా ఎత్తు నుంచి పడడంతో అతడి మెడ విరగడంతో పాటు తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత మూడు నెలలుగా తోస్టా ఆస్పత్రి బెడ్ కే పరిమితం అయ్యాడు.