సూర్యుడి ఏజ్‌ను నిర్ధారించిన యురోపియన్ స్పేస్ ఏజెన్నీ..
Sun: మనది సౌర కుటుంబం.. సూర్యుడే లేకుంటే.. భూమిపై జీవరాశి మనుగడే ఉండదు. అంతటి ప్రాధాన్యమున్న సూర్యుడు మాయమైతే?
Sun: మనది సౌర కుటుంబం.. సూర్యుడే లేకుంటే.. భూమిపై జీవరాశి మనుగడే ఉండదు. అంతటి ప్రాధాన్యమున్న సూర్యుడు మాయమైతే? అసలు సూర్యుడు ఎందుకు మాయం అవుతాడు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ ప్రశ్ననే యూరోపియన్ స్సేస్ ఏజెన్సీ- ESA శాస్త్రవేత్తలను తొలిచేసింది. దీనిపై పరిశోధనలను చేసి తాజాగా వివరాలను వెల్లడించారు. సూర్యుడి వయస్సు ఇప్పుడు 457 కోట్ల ఏళ్లుగా అంచనా వేశారు. ESA ప్రకారం సూర్యుడిలో తరచూ మంటలు సౌర తుఫానులు ఎదుర్కొంటున్నాడు. విశ్వంలోని వివిధ నక్షత్రాల జీవిత ప్రయాణాన్ని యూరోపియన్ స్సేస్ ఏజెన్సీ అంచనా వేసింది. తాజాగా ESAకు చెందిన గియా అంతరిక్ష కేంద్రం విడుదల చేసిన డేటాను విశ్లేషించి సూర్యుడి వయస్సును శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
గియా స్పేస్ సెంటర్ నుంచి అందిన మూడో ప్రధాన డేటా జూన్ 13న అందుబాటులోకి వచ్చింది. వందల కోట్ల నక్షత్రాల అంతర్గత లక్షణాలు ఈ డేటాలో ఉన్నాయి. ప్రతి నక్షత్రానికి ఉష్ణోగ్రత, పరిణామం, ద్రవ్యరాశి ఉంటాయి. ఈ క్రమంలో సూర్యుడి స్పష్టమైన వెలుగు, రంగును నిర్ధారించారు. భవిష్యత్తులో సూర్యుడు ఎలా పరిణామం చెందుతాడో యూరోపియన్ స్సేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తల అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సూర్యుడి వయస్సు 457 కోట్ల ఏళ్లని అంచనా వేశారు. ప్రస్తుతం భానుడు మధ్య వయస్సులో ఉన్నట్టు తెలుస్తోంది. సూర్యుడిలో కేంద్రక సంలీన ప్రక్రియ ద్వారా హైడ్రోజన్ అణువులు హీలియంగా మారుతుంటాయి. దీంతో సూర్యుడు ఎప్పుడూ స్థిరంగా ఉంటాడు.
అయితే హైడ్రోజన్‌లోని ఇంధనం క్రమంగా క్షీణిచడంతో కేంద్రక సంలీన ప్రక్రియ కూడా క్రమంగా నిలిచిపోతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే సూర్యుడి ఉపరితంలపై ఉష్ణోగ్రత తగ్గుతందట. దీంతో సూర్యుడి బరువు కూడా మారననున్నట్టు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. క్రమంగా సూర్యుడు మృత నక్షత్రంగా మారునున్నట్టు చెబుతున్నారు. అంటే సూర్యుడు అంతర్థానం అవుతాడన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు మనకు ఆకాశంలో కనిపించే ఓ నక్షత్రంలా మారుతాడు. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందనే దానిపైనా యూరోపియన్ స్సేస్ ఏజెన్సీక్లారిటీ ఇచ్చింది. వెయ్యి 11 వేల కోట్ల ఏళ్ల తరువాత సూర్యుడు మాయం కానున్నట్టు వివరించారు. తమ లెక్కలు ఖచ్చితమైనవని యూరోపియన్ స్సేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.