PM Kisan: మీరు పీఎం కిసాన్ ప్రయోజనం పొందుతున్నారా.. అయితే దీనికి కూడా అర్హులే..!
PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో 12.50 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మరో ప్రయోజనం కల్పిస్తోంది.
PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో 12.50 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మరో ప్రయోజనం కల్పిస్తోంది. ప్రస్తుతం పీఎం కిసాన్ నిధి అభ్యర్థులు 11వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విడత వారికి ఏప్రిల్-జూలైలోపు అందించాల్సి ఉంది. 'కిసాన్ భాగస్వామ్య ప్రాధాన్యత మా' పథకం కింద PM కిసాన్ నిధి లబ్ధిదారులందరికీ 'కిసాన్ క్రెడిట్ కార్డ్' (KCC) అందిస్తున్నారు. ఇందుకోసం మే 1వ తేదీ వరకు ప్రత్యేక గ్రామసభలు నిర్వహించి కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) లేని రైతుల దరఖాస్తులను సిద్ధం చేసి బ్యాంకు శాఖలకు పంపుతున్నారు.
ప్రభుత్వం జారీ చేసిన సూచనల ప్రకారం.. PM కిసాన్ నిధి లబ్ధిదారులెవరైనా 'కిసాన్ క్రెడిట్ కార్డ్'ని కలిగి ఉండకపోతే వారు బ్యాంకును సంప్రదించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఎంచుకున్న పేపర్లతో డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సరళమైన ఒక పేజీ దరఖాస్తు ఫారమ్‌లో భూమికి సంబంధించిన పత్రాలు, పంట వివరాలు, లబ్దిదారుడు ఏ బ్యాంకు నుంచి కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) సదుపాయాన్ని పొందలేదని ధృవీకరణ సమర్పించాలి. రైతులందరికీ క్రెడిట్ కార్డు ప్రయోజనం కల్పించడమే ఈ పథకం ప్రభుత్వ ఉద్దేశం.
PM కిసాన్ నిధి ప్రతి లబ్ధిదారుడు e-KYCని కలిగి ఉండటం అత్యవసరం. ఇందుకోసం మొబైల్, ల్యాప్‌టాప్‌ల నుంచి ఈ-కేవైసీ సౌకర్యాన్ని ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది. వెంటనే అప్‌డేట్ చేసుకోండి. అలాగే కేసీసీ కార్డు ద్వారా తక్కువ వడ్డీతో రుణం పొందవచ్చు. సకాలంలో చెల్లిస్తే వడ్డీ కూడా తగ్గిస్తారు. దాదాపు లక్షా అరవై వేల వరకు రుణం మంజూరు చేస్తారు. వెంటనే రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.