Agriculture News: ఈ పంట సాగు చేస్తే దశ తిరుగుతుంది.. కిలో సరుకు ధర 35 వేలు..!

Agriculture News: భారతీయ వంటగదిలో ఇంగువకి చాలా ప్రత్యేక స్థానం ఉంది. దీనిని వంటకాలలో వాడటం వల్ల ఒక ప్రత్యేక రుచి వస్తుంది.

Update: 2023-06-19 15:00 GMT

Agriculture News: ఈ పంట సాగు చేస్తే దశ తిరుగుతుంది.. కిలో సరుకు ధర 35 వేలు..!

Agriculture News: భారతీయ వంటగదిలో ఇంగువకి చాలా ప్రత్యేక స్థానం ఉంది. దీనిని వంటకాలలో వాడటం వల్ల ఒక ప్రత్యేక రుచి వస్తుంది. అంతేకాదు ఇంగువలో అద్భుత ఔషధగుణాలు దాగి ఉన్నాయి. దీనిని వాడటం వల్ల అనేక వ్యాధులకి ఉపశమనం లభిస్తుంది. అందుకే చాలా మంది దీనిని ఔషధంగా ఉపయోగిస్తారు. ఇంగువను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపుకు సంబంధించిన అనేక వ్యాధులు నయమవుతాయి.

హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, పంజాబ్, లడఖ్‌లలో రైతులు పెద్ద ఎత్తున ఇంగువ సాగు చేస్తారు. అంతేకాకుండా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంగువ సాగుకు రైతులను ప్రోత్సహిస్తోంది. అయితే ఇంగువని చల్లని వాతావరణంలో మాత్రమే సాగు చేస్తారు. కానీ శాస్త్రవేత్తలు ఇంగువ రకాలపై పరిశోధనలు చేస్తున్నారు. తద్వారా దీనిని వేడి ప్రాంతాలలో కూడా సాగు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

కిలో ఇంగువ ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ఇంగువ సాగుకు ఇసుక, బంకమట్టి నేల ఉత్తమంగా చెబుతారు. రైతు సోదరులు ఇసుక, బంకమట్టిలో ఇంగువ సాగు చేస్తే మంచి దిగుబడి సాధించవచ్చు. ఇంగువ సాగు చేస్తున్న పొలంలో నీటి ఎద్దడి ఉండకూడదు. లేదంటే మొక్కలు దెబ్బతింటాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ఇంగువ ధర 35 నుంచి 40 వేల రూపాయల వరకు పలుకుతోంది. రైతు సోదరులు ఒక ఎకరంలో ఇంగువ సాగు చేస్తే పెద్దమొత్తంలో ఆదాయం సంపాదించవచ్చు.

ప్రతి సంవత్సరం 1200 టన్నుల ఇంగువ దిగుమతి

ఒక లెక్క ప్రకారం ప్రపంచంలోనే ఇంగువను అత్యధికంగా వినియోగించేది భారతదేశమే. ప్రపంచం మొత్తంలో ఉత్పత్తి అయ్యే ఇంగువలో 40 నుంచి 50 శాతం భారతదేశం మాత్రమే ఉపయోగిస్తుంది. అయితే భారతదేశంలో ఇంగువ సాగు చేయడం చాలా తక్కువ. ఈ పరిస్థితిలో డిమాండ్‌ను తీర్చడానికి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. భారతదేశం ప్రతి సంవత్సరం 1200 టన్నుల ముడి ఇంగువను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు ఒక లెక్క. ఇందుకోసం ప్రభుత్వం రూ.600 కోట్లు ఖర్చు చేస్తుంది. అందుకే రైతులు ఈ పంటని పండిస్తే ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చు.

Tags:    

Similar News