Weed Cutting Machine: కూలీ సమస్యను అధిగమించే ఉపాయం.. సులభంగా కలుపు నివారణకు పరికరం
weed cutting machine: వరి నాటిన తర్వాత సాధారణంగా రైతులు ఎదుర్కొనే తొలి సమస్య కలుపు. ప్రస్తుత కరోనా వ్యాప్తి వలన కలపు నివారణకి కూలీ కొరత కూడా పెరిగింది. వీటిని అధిగమిస్తూ స్వయంగా కలుపు తీసే పరికరాన్ని తయారు చశాడు వరంగల్ జిల్లా తొర్రూరు మండలంలానికి చెందిన ఓ రైతు. మరి ఆ యంత్రం పనితీరు ఏంటో మనమూ చూద్దం.
వరి పంటలో కలుపు మొక్కలను నివారించే యంత్రాన్ని వరంగల్ జిల్లా తొర్రూరు మండలంలోని సోమావారం గ్రామానికి చెందిన ఓ రైతు తయారు చేశాడు. గ్రామానికి చెందిన రైతు రావుల ప్రభాకర్ వరిపంట సాగు చేశాడు. పొలంలో కూలీల సాయం లేకుండా కలుపు మొక్కలను నివారించడానికి తనకు వచ్చిన ఆలోచనతో ఓ యంత్రాన్ని తయారు చేశాడు. ఆ యంత్రంతోనే వరి పంటలో పెరిగిన కలుపు మొక్కలను సులువుగా నివారిస్తున్నాడు. దీంతో కలుపు తీయడానికి కూలీ ఖర్చులు మిగిలాయి. కలుపు మొక్కల నివారణ యంత్రాన్ని చూసిన గ్రామస్తులు, తోటి రైతులు అభినందిస్తున్నారు.
ఈ కలుపు నివారణ యంత్రం ద్వారా ఒక గంటకు ఒక ఎకరం పొలంలో కలుపు మొక్కలను నివారించవచ్చని ప్రతీ సంవత్సరం వరి పంటలో కలుపు మొక్కలను నివారించడానికి పెట్టుబడికే డబ్బులు అధికమవుతున్నాయని ఆలోచించి, తనకున్న పరిజ్ఞానంతో ఈ కలుపు నివారణ యంత్రాన్ని కనుగొని కలుపు మొక్కలను నివారిస్తున్నాని, దీంతో డబ్బులు కూడా మిగులుతున్నాయని అంటున్నాడు రైతు ప్రభాకర్.