Today Weather Report: తెలుగు రాష్ట్రాల్లోఈరోజు వాతావరణం

Update: 2020-01-30 08:26 GMT

తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు వాతావరణం సాధారణం కంటే వేడిగా ఉంది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో పొడిగా ఉంది. ఉదయం సమయంలో వాతావరణం మేఘావృతమై ఉంది. అదే విధంగా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అధికంగానే నమోదు అయ్యాయి. రెండు రాష్ట్రాల్లోనూ వేసవి ముందే ప్రారంభమైనట్టుగా వాతావరణం ఉంది. ఇవే పరిస్థితులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. జాతీయ వాతావరణ శాఖ(ఐఎమ్డీ) తమ వెబ్ సైట్ లో వెల్లడించిన వివరాల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలోని ముఖ్య నగరాలలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్నోగ్రతల వివరాలు.. ఈరోజు (30.01.2020) ఉదయం 8:30 గంటలకు ఐఎమ్డీ పేర్కొన్న వాతావరణ వివరాలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్ లో..


హైదరాబాద్ లో రాగల 24 గంటల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కొంచెం ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఈరోజు (30.01.2020) ఉదయం 8:30 గంటల వరకూ నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. అత్యధిక ఉష్ణోగ్రత 30.0 డిగ్రీలుగా నమోదయింది. ఇది సాధారణం కంటే 2 డిగ్రీలు ఎక్కువ. అత్యల్ప ఉష్ణోగ్రత 18.5 డిగ్రీలు నమోదయింది. ఈ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువ. ఇక ఉదయం 8:30 గంటలకు గాలిలో తేమ 68 శాతంగా ఉంది. ఈరోజు సూర్యాస్తమయ సమయం 18:10 గంటలు.

విజయవాడలో..


విజయవాడలో రాగల 24 గంటల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. కొంత మేర మేఘావృతం అయ్యే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కొంచెం ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఈరోజు (30.01.2020) ఉదయం 8:30 గంటల వరకూ నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. అత్యధిక ఉష్ణోగ్రత 33.0 డిగ్రీలుగా నమోదయింది. ఇది సాధారణం కంటే 2 డిగ్రీలు ఎక్కువ. అత్యల్ప ఉష్ణోగ్రత 23.0 డిగ్రీలు నమోదయింది. ఈ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువ. ఇక ఉదయం 8:30 గంటలకు గాలిలో తేమ 87 శాతంగా ఉంది. ఈరోజు సూర్యాస్తమయ సమయం 18:02 గంటలు.

విశాఖపట్నంలో..


విశాఖపట్నంలో రాగల 24 గంటల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. కొంత మేర మేఘావృతం అయ్యే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కొంచెం ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఈరోజు (30.01.2020) ఉదయం 8:30 గంటల వరకూ నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. అత్యధిక ఉష్ణోగ్రత 29.4 డిగ్రీలుగా నమోదయింది. ఇది సాధారణం కంటే 1 డిగ్రీ ఎక్కువ. అత్యల్ప ఉష్ణోగ్రత 23.7 డిగ్రీలు నమోదయింది. ఈ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువ. ఇక ఉదయం 8:30 గంటలకు గాలిలో తేమ 83 శాతంగా ఉంది. ఈరోజు సూర్యాస్తమయ సమయం 17:50 గంటలు.

అదేవిధంగా అనంతపురంలో అత్యధిక ఉష్ణోగ్రత 34.7 డిగ్రీలు..అత్యల్ప ఉష్ణోగ్రత 19.3 డిగ్రీలు,

కడపలో అత్యధిక ఉష్ణోగ్రత 34.80 డిగ్రీలు..అత్యల్ప ఉష్ణోగ్రత 21.0డిగ్రీలు

తిరుపతిలో అత్యధిక ఉష్ణోగ్రత 34.6 డిగ్రీలు..అత్యల్ప ఉష్ణోగ్రత 21.1 డిగ్రీలు

హనుమకొండలో అత్యధిక ఉష్ణోగ్రత 30.0 డిగ్రీలు..అత్యల్ప ఉష్ణోగ్రత 19.5 డిగ్రీలు

రామగుండంలో అత్యధిక ఉష్ణోగ్రత 31.2 డిగ్రీలు..అత్యల్ప ఉష్ణోగ్రత 19.5 డిగ్రీలుగా నమోదయ్యాయి. 

Tags:    

Similar News