దేశీ వరి సాగులో ప్రయోగాల ఘణుడు, విదేశీ వరి రకాలు సైతం సాగు చేస్తూ అందరిని అబ్బుర పరుస్తున్నాడు ఓ అభ్యుదయ రైతు. చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబ నేపథ్యంలో పెరిగిన ఆయన వరిలో ప్రయోగాలు చేస్తూ రైతు శాస్త్రవేత్తగా మారిపోయారు. మూడు ఎకరాల్లో 24 రకాల దేశీ వరి వంగడాలు పండిస్తూ క్షేత్రాన్ని సప్తవర్ణశోభితంగా మార్చారు. ఆకుపచ్చ, ఎరుపు, నలుపు , గోధుమ రంగులతో తన వరిక్షేత్రాన్ని ఓ ప్రయోగశాలగా తీర్చిదిద్దారు. ఇంతకీ ఈ రైతు చేస్తున్న ప్రయోగాలు ఏంటి..? ఆయన పండిస్తున్న వరి రకాలకు ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసుకోవాలంటే నిజామాబాద్ జిల్లాలోని ఆయన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాల్సిందే.
నిజామాబాద్ జిల్లా చింతల్ గ్రామానికి చెందిన చిన్నికృష్ణుడు అలియాస్ గంగారాం, మొదట ఓ సాధారణ రైతు మూడు ఎకరాల భూమిలో తన వరి సాగుని ప్రయోగాలరు వేదికగా మార్చారు. పాత వంగడాలను సేకరించడాన్ని అలవాటుగా మార్చుకున్న ఈ రైతు తన వ్యవసాయ క్షేత్రంలోనే వాటికి పునఃరుజ్జీవం పోస్తున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందకు పైగా వరి వంగడాలను సేకరించాడు. ప్రస్తుతం 24 రకాలను సాగు చేస్తున్నారు. 110 రకాల వరి సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకునీ తన 3 ఎకరాల భూమిలో ప్రస్తుతం 24 రకాల దేశీ వరి వంగడాల సాగు చేస్తున్నారు. ఇంతకీ ఈ వరి రకాలకు ప్రాధాన్యత ఏంటి ? వీటి సాగు పద్ధతి ఎలా ఉంటుంది ? ఇప్పుడు తెలుసుకుందాం.
-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..