ఇంటిల్లి పాదీ ఇంటిపంటల సాగు

Update: 2019-11-15 06:29 GMT

ఒకప్పుడు నగరవాసులు పెరటి తోటలంటే ఆటవిడుపుగా కేవలం పూల మొక్కలను మాత్రమే పెంచుకునే వారు, కానీ పెరుగుతున్న కూరగాయలు, పండ్ల ధరలు అధిక రసాయనాలతో అవి పండిస్తున్న తీరు వల్ల, స్వయంగా ఇంటిపంటల్లో సేంద్రియ పద్దతిలోనే వాటిని సాగు చేసుకుంటున్న సంస్కృతి పెరిగింది. నేల మీద పండే పండ్ల మొక్కల్ని, ఆయుర్వేదంగా ఉపయోగపడే ఔషధ మొక్కల్ని సైతం కూరగాయలతో పాటుగా వృధాగా ఉన్న చిన్నచిన్న టబ్బులు, గ్రోబ్యాగ్స్ వంటి వాటిని ఉపయోగించి పెంచుకుంటున్నారు. అదే విధంగా హైదరాబాద్ ఉప్పల్ కు చెందిన సృజన, కుటుంబంతో కలిసి మిద్దెతోటలను సాగుచెయ్యడమే కాకుండ విదేశాల్లో స్థిరపడిన తన కుమారుడ్ని కూడా మిద్దెతోటలు పెంచే విధంగా ప్రేరణ కలిగించారు. సకుటుంబంగా సాగు చేస్తున్న ఈ మిద్దెతోట పై ప్రత్యేక కథనం.

హైదరాబాద్ కు చెందిన సృజన తన భర్త కోసం చిన్నపాటి ఆయుర్వేద మొక్కలను సాగు చేసేది క్రమంగా మార్కెట్లో పండుతున్న కూరగాయలు, పండ్లలో రసాయనాల ప్రభావం ఎక్కువగా ఉండడంతో పాటు అవి పండిస్తున్న తీరు ఆమెను స్వయంగా ఇంటిపంటలు సాగు చేసుకునే విధంగా ఆలోచింపచేసింది. మిద్దెతోటల గురించి యూట్యూబ్ లో నిపుణుల సలహాలు పాటిస్తూ సేంద్రియ పద్దతిలో సాగు చేస్తూనే, విదేశాల్లో ఉన్న తన కుమారుడిని సైతం ఇంటిపంటలు పెంచే విధంగా ప్రేరణ కలిగిస్తున్నారు.

6 నెల్లకింద ఒక్క ఔషధ మొక్కతో మొదలైన ఆమె మిద్దెతోటలో నేడు నిత్యావసరాలకు పలు రకాల కూరగాయలు, ఆకుకూరలతో పాటు అరుదుగా దొరుకుతూ ఔషధ గుణాలు కలిగి ఉండే తెల్లజిల్లేడు, శరీరంలో రక్త కణాలను పెంచే గోదుమ గడ్డి, లెమన్ గ్రాస్, చెర్రీ టమాటా వంటి అరుదైన మొక్కలను గ్రోబ్యాగ్స్, వాడేసిన టబ్బులు, చిన్న చిన్న స్టాండ్లలో పెంచుకుంటూనే సొంతంగా విత్తనాలు అభివృద్ధి చేసుకోవడంతో పాటు స్వయంగా మొక్కల నార్లను కూడా ట్రేలలో పెంచుతున్నారు. నేల మీద పండే మొక్క జొన్న, బోగని విల్లా మొక్కలను కూడా మిద్దెతోటలో సాగు చేస్తున్నారు .

రసాయనాలోతో విసుగు చెందిన సృజన తన మిద్దెతోటలో మొక్కలకు ఎరువులుగా సహజ సిద్ధంగా తయారుచేసుకున్న కిచెన్ వేస్ట్ ని వాడుతున్నారు. అంతేకాకుండా తన పెరటిలో పెరుగుతున్న అరటిచేట్టు, పూనాస మామిడి, డ్రాగన్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ, ఎర్ర జామ వంటి అరుదైన పండ్ల మొక్కలకు ఎరువులుగా, చీడపీడల నివారణకు కోడిగుడ్డు ద్రావణం, జీవామృతాలతో పాటు ఆర్గానిక్ పద్దతిలో తయారుచేసుకున్న కషాయాలను ఉపయోగిస్తున్నారు.

నగరాల్లో కాలుష్యం పెరిగిపోతుంది. అంతే కాకుండా మార్కెట్లో ఎటు చూసినా రసాయనాలు వేసి పండించిన ఆహార పదార్థాలతో రోగాల బారిన పడాల్సిన పరిస్థితి ఉండడంతో స్వయంగా సాగు చేసుకునే మిద్దెతోటల వల్ల ఆరోగ్యం, డబ్బు ఆదా అవ్వడంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని, కుటుంబ సమేతంగా ఇంటిపంటలు సాగు చేసుకోవడం ఆనందాన్నిస్తుందని మిద్దెతోట నిర్వాహకులురాలు సృజన భర్త శ్రీనివాస్ అంటున్నారు.

సేంద్రియ పద్దతిలో ఇంటిపంటలు సాగు చెయ్యడం వల్ల మన అరోగ్యం బాగుండడమే కాదు పర్యావరణానికి కూడా మేలు కలుగుతుంది. మార్కెట్లో దొరికే కూరగాయలు రసాయనాల ప్రభావం ఎక్కువ ఉంటున్న కారణంగా వాటి వల్ల కలిగే అనారోగ్యాలను అరికట్టాలంటే ఆర్గానిక్ పద్దతిలో మిద్దెతోటలు పెంచుకోవడమే మేలని, మొదట్లో కాస్త ఇబ్బంది అయినా తన తల్లితో కలిసి టెర్రస్ గార్డెన్ నిర్వహించడం సంతోషన్ని కలిగిస్తుందని అంటున్నాడు సృజన కుమారుడు శ్రీరాం.

Full View 

Tags:    

Similar News