Terrace Gardening: మహా నగరాల్లోనే కాదు, చిన్న చిన్న పట్టణాలలోను మిద్దెతోటల సంస్కృతి పెరుగుతోంది. ఆరోగ్యాన్ని, మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చే ఇంటిపంటల సాగు పై ఎక్కువ శాతం కుటుంబికులు ఆసక్తి చూపుతున్నారు. తమకు అనువైన చిన్నపాటి ఖాళీ స్థలాలను సైతం మొక్కలతో నింపేస్తూ..స్వయంగా సేంద్రియ పద్ధతిలో ఔషధ, పండ్లు,కూరగాయల మొక్కలని సాగు చేస్తున్నారు. ఆ విధంగానే చినప్పటి నుండి గ్రామీణ వాతావరణంలో పెరిగి, పెరటితోట పెంపకాన్ని మరువకుండా నేటికీ ఇంటిపంటను సాగు చేస్తున్న రంగారెడ్డి జిల్లాకి చెందిన శాంకరీశ్వరి మిద్దెతోట పై ప్రత్యేక కథనం.
రంగారెడ్డి జిల్లా, తాండూర్ గ్రామానికి చెందిన శాంకరీశ్వరి, చిన్ననాటి నుండి పెరటి మొక్కల మధ్య గ్రామీణ వాతావరణంలో పెరిగింది. పసి వయసు నుండే పూల మొక్కల పెంపకం అలవాటు ఉన్న ఆమెకు, తన తండ్రి ఇచ్చిన స్పూర్తితో పూర్తి స్థాయి మిద్దెతోటలను సాగు చెయ్యడం మొదలుపెట్టింది. దాదాపు అన్ని రకాల పండ్లు, కూరగాయలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న మిద్దెతోట విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..