ఇంటి చుట్టూ లేదా మేడ మీద ఖాళీ స్థలం ఉంటే దానిని మిద్దెతోటగా మలుచుకోవాలనుకుంటారు చాలా మంది కానీ మియాపూర్‌కు చెందిన ఓ బ్యాంకు ఎంప్లాయ్ తన భార్య కోరిందని మిద్దె తోటలను సాగు చేసేందుకు ఓ ఇంటినే కొనేసాడు దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు వారికి సామాజిక ఆరోగ్య స్పృహ ఎంత వరకు ఉందో. ఆ ఇంట్లో ఉండేది ముగ్గురే కానీ ఇంటినంతా ఓ నందనవనంలో మార్చేసింది ఆ గృహిణి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు మాధవి మోహన్ .
సామాజిక మాధ్యమాల ద్వారా మిద్దె తోటల సాగు గురించి తెలుసుకున్నారు మాధవి మోహన్ మిద్దె తోటల ద్వారా కలిగే ప్రయోజాలనపై అవగాహన పెంచుకున్నారు. దీంతో కొత్తపేటలో తాము ఉండే అపార్ట్‌మెంట్ టెర్రస్ మీద 2017 లో మిద్దె తోటలను ప్రారంభించారు అది మంచి ఫలితాలను కూడా అందించింది కానీ అపార్ట్‌మెంట్ నిర్వాహకులు ఇందుకు అంగీకరించలేదు దీంతో సొంతంగా ఇంటి పంటలను సాగు చేసుకునేందుకు వీలుగా ఉండేందుకు మియాపూర్‌లోని బాచుపల్లిలో ఓ విల్లాను కొనుగోలు చేశారు. కేవలం మొక్కలను పెంచుకోవాలన్న తపనతో ఇంటి పంటల సాగుకు అనుగుణంగా విల్లాను నిర్మించుకున్నారు. ప్రస్తుతం పచ్చని మొక్కలు పెంచుతూ ఈ ఇంటినే ఓ నందనవనంలా మార్చేసారు.
కొత్తింట్లోకి అడుగుపెట్టగానే ఇళ్లు సర్దుకోవడం మానేసి మొక్కలను సర్దుకోవడం మొదలు పెట్టారు మాధవి. మేడమీద, ఇంటి ఆవరణలో మొక్కలను పెంచుకునేందుకు కేరళ, మహారాష్ట్ర నుంచి కొన్ని ప్రత్యేక విత్తనాలను తెప్పించుకున్నారు. వాటిని ప్రయోగాత్మకంగా సాగుచేస్తున్నారు. ప్రస్తుతం మిద్దె తోటలో ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి కూరగాయలు పండ్ల చెట్లను పెంచుతున్నారు. వేసవి సమయం కావడంతో ప్రస్తుతం ప్రారంభదశలో ఉండడం వల్ల మొక్కలను కాపాడుకునేందుకు షేడ్‌నెట్‌లను ఏర్పాటు చేసారు. అధిక ఉష్ణోగ్రతల నుంచి మొక్కలను కాపాడుతున్నారు.
పనికిరాని ఏ వస్తువునైనా పాడేయకుండా వాటిని ఇంటి పంటల సాగుకు అనువుగా మార్చుకున్నారు మాధవి. ఐరట్ టబ్స్‌లలో, ఖాళీ పెరుగు డబ్బాల్లో, థర్మాకోల్ బాక్సుల్లో, ఆఫీస్ డెస్క్ టేబుల్స్‌లో కూరగాయలు, ఆకుకూరలను పండించేస్తున్నారు. రసాయనాల వాడకం వల్ల కలిగే ప్రమాదాం గురించి తెలుసుకున్నారు కాబట్టి ఈ ఇంటి పంటలను పూర్తి సేంద్రియ విధానంలోనే సాగు చేస్తున్నారు. పశువుల ఎరువుతో పాటు ఇంట్లోని వ్యర్ధాలను ఉపయోగించి కంపోస్ట్‌ను సిద్ధం చేసుకుంటున్నారు.