వారిద్దరూ ఒకరికి ఒకరు తోడయ్యారు. ఐశ్వర్యంలోనే కాదు కడు పేదరికంలోనూ కలిసికట్టుగా నడుస్తున్నారు. సేద్యం తప్ప వేరే ధ్యాస వారికి లేదు దాని కోసం కష్టనష్టాలను ఎదుర్కొని సాగులో సాగుతున్నారు. ఆర్థిక భరోసా లేకపోయినా తమ సంకల్ప బలంతో కాడెడ్లుగా మారి పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. సాగు లో బ్రతుకుపోరాటం చేస్తున్నా వికారాబాద్ జిల్లాకు చెందిన వృద్ధ దంపతులపై ప్రత్యేక కథనం
రోజులు గడుస్తున్నాయి వయసు మీద పడుతుంది పండించడానికి పొలం ఉన్న తినడానికి తిండి లేదు వ్యవసాయం చేద్దామంటే పొలం పనులుకు కాడెద్దులు లేవు వృద్ధదంపతులైన పుల్యా నాయక్ , సంధమ్మ లు కష్టనష్టాలు ఎదురైనా ఎలాగైనా వ్యవసాయం చేయాలనే సంకల్పంతో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఎద్దులు లేకపోతేనేం మనమే కాడెద్దులు ఎందుకు అవ్వకూడదు అనుకున్నారో ఏమో అలాగే పొలం లో దంపతులు ఒకరికి ఒకరు తోడై ఒకరు కాడి మోస్తూ , మరొకరు దంతె పాడుతూ పొలాన్ని సాగు చేశారు .
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం సాల్విడ్ తాండ కి చెందిన వారు పుల్యా నాయక్, సంధమ్మ దంపతులు. కూలినాలి చేస్తూ జీవనం సాగించే వారు వీరికి నలుగురు కొడుకులు అందులో ముగ్గురు కొడుకులు బతుకు దేరువుకోసం తల్లిదండ్రులను వదిలి పూణే కి వెళ్ళిపోయారు మరో కొడుకు వికాలంగుడు, అతనికే ఈ వృద్ధ దంపతులు సేవలు చేయాలి. ఈ పరిస్థితుల్లో కటిక పేదరికం తో తినడానికి తిండి లేక అలమటిస్తుంది ఆ కుటుంబం ఆర్థికంగా ఆదుకొనే వారు లేక ఉన్న భూమిని సాగు చేయలేక దీన స్థితి లో ఉన్నారు.
అందుకే ఒకరి పై ఆధారపడకుండా ఉన్న కొద్ది పాటి పొలం లో దంపతులు ఇద్దరు జొన్న పంట సాగు చేయాలని ముందుకు సాగారు. పంటలోని కలుపు నివారణ కోసం కాడే ఎద్దులు గా మారారు పొలం పనులు కోసం ఎద్దులు కొనలేక , కూలీలకు డబ్బులు ఇచ్చే స్థోమత లేక ఇద్దరు కూలీలు గా మరి భర్త దంతే పట్టుకుంటే భార్య లాగడం , భార్య దంతే పట్టుకుంటే భర్త లాగడం ఇలా అలసిపోయే వరకు పొలంలో పనులు చేస్తున్నారు ఈ వృద్ధ దంపతులు .
ఈ దంపతులు పడుతున్న కష్టాన్ని చూసి గ్రామస్తులు చలించి పోయారు ఎలాగైనా ప్రభుత్వం వారికి చేయూత నివ్వాలని కోరుతున్నారు. కనీసం ప్రభుత్వం అమలు పరుస్తున్న పించన్ కూడా రాకపోవడం తో వారి జీవనం మరింత అగమ్య గోచరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి ఆర్థికంగా ఆదుకొని , వ్యవసాయం చేసుకోవడం కోసం ఎద్దులను కొనిచ్చే విధంగా చర్యలు చేపట్టాలి అంటున్నారు గ్రామస్తులు .
వయసు మీద పడిన వారి సంకల్పం ఆగలేదు వ్యవసాయం చేయాలి అంటే కాడెద్దెలు అవసరం లేదు సంకల్ప బలం చాలు అంటూ ఈ నిరుపేద వృద్దదంపతులు చేసిన పనిని చూసి అందరు నేర్చుకోవాలి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ కుటుంబానికి చేయుతనివ్వాలని కోరుకుందాం .