Sugarcane Farmers Problems In Medak: రైతన్నకు నష్టం.. చెరుకు సాగు కష్టం

Update: 2020-07-01 12:26 GMT

Sugarcane Farmers Problems In Medak: అందరికీ తీపిని పంచే రైతులు మాత్రం చేదును అనుభవిస్తున్నారు. పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు. చెరుకు రైతులు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నారు. బకాయిలు చెల్లించకుండా పరిశ్రమలు వేధిస్తున్నాయి.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు. డి గ్రామం వద్ద యాబై సంవత్సరాల క్రితం నిజాం సుగర్స్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటైంది. స్థానికంగానే చక్కెర పరిశ్రమ ఏర్పాటు కావడం తో చెరుకు సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరుగింది. ప్రభుత్వ రంగం సంస్థ అయినా నిజాం సుగర్స్ తదనంతరం ప్రైవేటు సంస్థల చేతిల్లోకి మారుతూ వస్తోంది. ప్రస్తుతం ట్రైడెంట్ సుగర్స్ ఆధ్వర్యంలో పరిశ్రమ నడుస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేట్ కంపెనీల చేతిలోకి ఎప్పడైతే వెళ్లిందో అప్పటి నుండి చెరుకు రైతుల కష్టాలు మొదలైయ్యాయి.

మొదట మద్దతు ధర సాధించటం కోసం ఆందోళన చేసిన రైతులు గత కొద్దీ సంవత్సరాలుగా బకాయిల కోసం ఆందోళన చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గత రెండు సంవత్సరాల నుండి పరిస్థితి మరింత దిగజారింది. సంవత్సరాల తరబడి బకాయిలు చెల్లించకుండా పరిశ్రమలు చెరుకు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గతంలో రైతుల బకాయిలు రాబట్టడం కోసం జహీరాబాద్‌లో పెద్ద ఉద్యమమే చేయాల్సి వచ్చింది.

ఇక ఈ ఏడాది క్రషింగ్ పూర్తయి 5 నెలలు కావస్తున్నా ఇంకా బకాయిలు చెల్లించలేదు. ఈ సంవత్సరం ఒక లక్ష పదకొండు వేల మూడు వందల తొంభై ఎనిమిది మెట్రిక్ టన్నుల చేరుకును పరిశ్రమ రైతుల వద్ద నుండి కొనుగులు చేసి క్రషింగ్ చేసింది. ఇందుకు గానూ రైతులకు 34.31 కోట్ల రూపాయలు చెల్లించాలి. వీటిలో 18.85 కోట్లను ఇప్పటివరకు పరిశ్రమ చెల్లించింది. ఇంకా 15.45 కోట్ల రూపాయల బకాయిలు రైతులకు చెల్లించాల్సి ఉంది.

చెక్కర పరిశ్రమల యాజమాన్యాల తీరుతో విసిగి పోయిన పలువురు రైతులు చెరుకు పండించడం మానివేస్తున్నారు. వీటికి తోడు వర్షాలు లేక పోవడం, కర్మాగారం వైకిరి కారణంగా చెరుకు సాగు గతం తో పోలిస్తే 20 శాతానికి పడిపోయింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే చెరుకు పంట ఈ ప్రాంతం నుండి కనుమరుగు కాక తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

Full View


Tags:    

Similar News