Quail Birds: 1500 కంజులతో.. ప్రతి నెల రూ.70 వేల సంపాదన..

Quail Birds Farming: సాధించాలనే పట్టుదల ముందు ఓటమి బలాదూర్ అని నిరుపిస్తున్నాడో ఓ యువకుడు.

Update: 2022-12-17 06:16 GMT

Quail Birds: 1500 కంజులతో.. ప్రతి నెల రూ.70 వేల సంపాదన..

Quail Birds Farming: సాధించాలనే పట్టుదల ముందు ఓటమి బలాదూర్ అని నిరుపిస్తున్నాడో ఓ యువకుడు. అనుభవం నేర్పిన పాఠాన్ని పలువురి రైతన్నలకు నేర్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. వ్యవసాయ రంగంపై మక్కువతో అనుబంధరంగాలవైపు అడుగులు వేసి అధిక లాభాలు సాధించవచ్చునని యువరైతు చేసిన అధ్యయనాలు విజయానికి సోఫానాలుగా మారాయి. కౌజు పిట్టల పెంపకం చేస్తూ తక్కువ సమయంలో లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతూ అందరిచే శభాష్ అనిపించుకుంటున్న యువరైతు నరేందర్ కుమార్ పై ప్రత్యేక కథనం.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గుడివాడ మండలం దొండపాడుకు చెందిన నరేందర్ కుమార్ కార్పోరేట్ స్కూల్స్ లో ఏవోగా పనిచేశాడు. అనంతరం వ్యవసాయ రంగంపైన మక్కువతో సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని నడిగూడెం మండలం చిన్నకేశావాపురంలోని తన మామ వ్యవసాయ క్షేత్రంలో 2016లో నాటుకోళ్ల పెంపకం యొదలు పెట్టాడు. అయితే ప్రారంభంలో కోళ్ల పెంపకం భాగానే ఉన్నా.. రానురాను కోళ్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోయి, వైరస్ కారణంగా 800 వందల కోళ్లకుపైగా చనిపోయాయి. దీంతో సుమారు 8 లక్షల రూపాయల వరకు నష్టపోయిన నరేందర్ , రాజేంద్రనగర్ వెటర్నరీ యూనివర్సీటీని ఆశ్రయించి తనగోడును వెళ్లబోసుకున్నాడు. అయితే అక్కడి ఎక్స్ పర్ట్స్ నాటుకోళ్ల కంటే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు అందించే కౌజుపిట్టల పెంపకంపై అవగాహన కల్పించారు. కౌజుల పెంపకంపై దృష్టి సారించాలని సూచించారు.

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలన్న సామెతను ఫాలో అయిన నరేందర్ ఐదేళ్ల క్రితం 3 ఎకరాలు భూమిని 10 సంవత్సరాలకు లీజుకు తీసుకుని కౌజు పిట్టల ఫాం పెట్టుకున్నాడు. రాజేంద్రనగర్ వెటర్నరీ యూనివర్సీటి నుంచి కొన్ని ప్రేవేట్ హ్యచరీల నుంచి కౌజు పిల్లలను తీసుకొచ్చాడు. అందులో కొన్ని ఇబ్బందులు రావడంతోసొంతంగా హ్యాచరీని ఏర్పాటు చేసుకుని తానే గుడ్లను గ్రేడిండ్ చేసుకొని పిల్లలను హ్యాచరీ ద్వారా ఉత్పత్తి చేసుకోవడం ప్రారంభించాడు . ఇలా చేసుకోవడం వల్ల 25 రోజుల నుంచి నెల రోజుల్లోనే పిల్లలు పట్టుబడికి వస్తున్నాయని యువరైతు తెలిపాడు.

హోటల్స్, దాబాలు, అపార్ట్ మెంట్ , ఇళ్లకు ఆర్డర్ ద్వారా బర్డ్స్, మీట్ ను సప్లై చేస్తున్నాడు. కేజీ మీట్ ను కట్ చేసి ప్యాకింగ్, ట్రాన్స్ పోర్ట్ తో కలుపుకుని 650 వరకు అమ్ముతున్నాడు. ప్రతి నెల 6 యూనిట్ల కౌజు పిట్టల ఉత్పత్తిని సాధిస్తూ 60 వేల నుంచి లక్ష రూపాల వరకు ఆదాయాన్ని సంపాధిస్తున్నాడు యువరైతు నరేందర్ కుమార్.

కౌజులకు యాంటీబయోటిక్స్, లివర్ టానిక్ లను వాడుతూ వాటి ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలను తీసుకుంటున్నారు నరేందర్. నిపుణులు అందించే సలహాలను పాటిస్తున్నాడు. ప్రతి రోజు రెండు సార్లు ఫీడ్, నాలుగు సార్లు నీళ్లు పెట్టాల్సి ఉంటుందని చెబుతున్నాడు. ఇక కొత్తగా ఫాం పెట్టాలనుకునే వారు పిల్లలను నేరుగా వెళ్లి కొనుగోలు చేయాలని మధ్యవర్తులను ఎట్టి పరిస్ధితుల్లోనూ నమ్మవద్దని సూచిస్తున్నారు రైతు నరేందర్. బ్రీడింగ్ , ఇన్ బ్రీడింగ్ వంటి విషయాలను చూసుకోవాలని...ఇన్ బ్రీడింగ్ తీసుకోవద్దని ఇందులో పిల్ల ఎదుగుదల తక్కువ ఉంటుందనంటున్నాడు.

తనను చూసి కౌజుపిట్టల పెంపకంపై పలువురు ఔత్సాహిక రైతులు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఇందులో పెంపకంపై పూర్తి స్దాయిలో అవగాహన పొందితేనే రాణించవచ్చంటున్నారు నరేందర్. ఏ పని మొదులు పెట్టినా అందులో పూర్తి స్ధాయిలో అవగాహన అవసరమని లేని పక్షంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలెక్కువని తన అనుభవాల ద్వారా తెలియజేస్తున్నాడు యువరైతు నరేందర్ కుమార్.

Full View


Tags:    

Similar News