PM Kisan: ఈ ఐదు కారణాల వల్ల పీఎం కిసాన్‌ ఆలస్యం.. వెంటనే ఈ పనులని పూర్తి చేయండి..!

PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడత కోసం దేశవ్యాప్తంగా 12.5 కోట్ల మంది రైతులు ఎదురుచూస్తున్నారు.

Update: 2022-05-11 09:30 GMT

PM Kisan: ఈ ఐదు కారణాల వల్ల పీఎం కిసాన్‌ ఆలస్యం.. వెంటనే ఈ పనులని పూర్తి చేయండి..!

PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడత కోసం దేశవ్యాప్తంగా 12.5 కోట్ల మంది రైతులు ఎదురుచూస్తున్నారు. రైతుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ నిధి యోజనను ప్రారంభించింది. ఈ పథకం 10వ విడత జనవరిలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు వచ్చింది. పీఎం కిసాన్ 11వ విడత ఏప్రిల్, జూలై మధ్య వస్తుంది. గతేడాది మే 15న అర్హులైన రైతుల ఖాతాల్లోకి వాయిదా సొమ్ము జమ చేశారు. అయితే ఈసారి దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. మరోవైపు, e-KYC కోసం చివరి తేదీ మార్చి 31 నుంచి మే 31 వరకు పొడగించారు. ఈ పరిస్థితిలో కింది 5 కారణాల వల్ల PM కిసాన్ నిధి వాయిదాలో జాప్యం జరుగుతోంది.

1: eKYC

ఈ ఏడాది ప్రభుత్వం రైతులకు ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది. గతేడాది దీనిపై ఎలాంటి ఒత్తిడి లేదు. దీని వల్ల పీఎం కిసాన్ 11వ విడత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇంతకుముందు దీనిని నిర్వహించడానికి చివరి తేదీ మార్చి 31 ఉండేది. దీనిని ఇప్పుడు మే 31 వరకు పొడిగించారు. మీరు PM కిసాన్ పోర్టల్‌ని సందర్శించడం ద్వారా కేవైసీని అప్‌డేట్‌ చేయవచ్చు.

సాగు భూమి

పథకం ప్రారంభంలో 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి ఉన్న రైతులు PM కిసాన్ నిధికి అర్హులు. కానీ ఇప్పుడు ఈ నిబంధన మార్చారు. ఇప్పుడు రైతులందరూ ఈ పథకం కింద నమోదు చేసుకోవచ్చు. కాబట్టి 11వ విడత ఆలస్యం కావడానికి ఈ మార్పు కూడా ఒక కారణం కావొచ్చు.

అనర్హుల నుంచి రికవరీ

ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న లేదా ఐటీఆర్ దాఖలు చేసే రైతులు ఈ పథకం కింద అర్హులు కాదు. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా పీఎం కిసాన్ ఫండ్ అందుతున్నట్లు ఇటీవల కొన్ని కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆ డబ్బులని తిరిగి ఇవ్వాలని కోరారు. 11వ విడత ఆలస్యానికి ఇది కూడా ఒక కారణమయ్యే అవకాశం ఉంది.

కిసాన్ క్రెడిట్ కార్డ్‌లో మార్పు

కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది భారత ప్రభుత్వ పథకం. దీని కింద రైతులకు అందుబాటు ధరలో రుణ సౌకర్యం కల్పిస్తారు. ఈ పథకం పీఎం కిసాన్‌తో ముడిపడి ఉంటుంది. ప్రధానమంత్రి కిసాన్ నిధి వాయిదా ఆలస్యం కావడానికి ఈ కార్డుల పంపిణీ కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.

కనీస పత్రాలు

ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రభుత్వం ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తోంది. దీని తర్వాత రైతులు తమ ఆధార్ కార్డు సహాయంతో ఇంట్లో కూర్చొని ఈ పథకం కింద నమోదు చేసుకోవచ్చు.

Tags:    

Similar News