PM Kisan: రైతులకి అలర్ట్‌.. మీరు కూడా ఈ తప్పు చేశారా అయితే నోటీసులే..!

PM Kisan: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 11వ విడత కోసం దేశంలోని కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు.

Update: 2022-04-23 08:54 GMT

PM Kisan: రైతులకి అలర్ట్‌.. మీరు కూడా ఈ తప్పు చేశారా అయితే నోటీసులే..!

PM Kisan: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 11వ విడత కోసం దేశంలోని కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. 11వ విడత మే నెలలో ప్రభుత్వం విడుదల చేయవచ్చు. చాలా రాష్ట్రాలు దీనికి ఆమోదం కూడా తెలిపాయి. 10వ విడత తర్వాత ప్రభుత్వం ఈ-కేవైసీని తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం చివరి తేదీని మే 31 వరకు పొడిగించారు. అయితే 11వ విడత విడుదల కాకముందే యూపీలోని జలౌన్ జిల్లాలో ఫోర్జరీ తెరపైకి వచ్చింది. 1740 మంది రైతులు అక్రమంగా పీఎం కిసాన్‌ ప్రయోజనాన్ని పొందుతున్నట్లు తేలింది. దీంతో వారికి నోటీసులు జారీ అయ్యాయి. ప్రభుత్వం ఆ నిధుల మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కోరింది. నిజానికి ఈ పథకం ఉద్దేశం చిన్న రైతులను ఆర్థికంగా ఆదుకోవడమే. దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులు ఈ పథకం కింద నమోదు చేసుకున్నారు.

పీఎం కిసాన్‌ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 6000 రూపాయలను రైతుల ఖాతాలకు పంపుతుంది. ఈ మొత్తం 2000 చొప్పున 3 విడతలుగా అందిస్తారు. ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు జీతాలు తీసుకునే రైతులు, ఆదాయపు పన్ను చెల్లించే రైతులు ఈ పథకానికి అర్హులు కాదని చెప్పారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో ఆదాయపు పన్ను చెల్లిస్తున్న 1740 మంది రైతులు పిఎం కిసాన్ ప్రయోజనాన్ని పొందినట్లు తేలింది. దీంతో అనర్హులందరు ఆ సొమ్మును తిరిగి ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పలువురు రైతులు స్వయంగా ఇక్కడికి వచ్చి చెక్కుల ద్వారా డబ్బులు తిరిగి చెల్లిస్తున్నారు.

కేంద్రం అమలు చేస్తున్న ఈ పథకంలో రాష్ట్రాల ఆమోదం కూడా తప్పనిసరి. 11వ విడతకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా అనుమతి ఇవ్వలేదు. పోర్టల్‌లో స్టేటస్‌ని తనిఖీ చేసినప్పుడు ఈ విషయం మీకు తెలుస్తుంది. స్టేటస్‌ తనిఖీ చేస్తున్నప్పుడు RFT (Request for Transfer) ఉంటే లబ్ధిదారుడి డేటాను రాష్ట్రం తనిఖీ చేసిందని, లబ్ధిదారుడి ఖాతాకు డబ్బును పంపమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించిందని అర్థం. FTO (Fund Transfer Order) కనిపిస్తే ఫండ్ బదిలీ ప్రక్రియ ప్రారంభమైందని అర్థం. ఇన్‌స్టాల్‌మెంట్ విడుదలైన వెంటనే కొద్ది రోజుల్లో మొత్తం మీ ఖాతాకు బదిలీ చేస్తారు.

Tags:    

Similar News