PM Kisan: రైతులకి అలర్ట్.. నవంబర్ 30లోపు ఖాతాలలో డబ్బులు..!
PM Kisan: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాన్ని పొందుతున్న కోట్లాది మంది రైతులకు పెద్ద అప్‌డేట్ ఉంది.
PM Kisan: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాన్ని పొందుతున్న కోట్లాది మంది రైతులకు పెద్ద అప్‌డేట్ ఉంది. రైతుల ఖాతాలో 12వ విడత సొమ్మును ప్రభుత్వం విడుదల చేసింది. ఖాతాకు ఇంకా 2000 రూపాయలు బదిలీ కాకపోతే ఆందోళన చెందాల్సిన పనిలేదు. నవంబర్ 30లోపు రైతులందరికీ ఈ సొమ్ము జమ అవుతుందని అధికారులు తెలిపారు.
డబ్బు నిలిచిపోయిన రైతులందరూ వ్యవసాయ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం సూచించింది. 30వ తేదీ నాటికి వారి ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి. ఇది కాకుండా మీరు మీ వ్యవసాయ అధికారికి కూడా ఫిర్యాదు చేయవచ్చు. మీరు హెల్ప్‌లైన్ నంబర్ 155261 / 011-24300606కు కాల్ చేయవచ్చు. ఇక్కడ మీరు ఇన్‌స్టాల్‌మెంట్ స్టేటస్‌ని పొందుతారు. దీంతో పాటు పీఎం కిసాన్ యోజన టోల్ ఫ్రీ నంబర్ 18001155266 లేదా డైరెక్ట్ హెల్ప్‌లైన్ నంబర్ 011-23381092లో సంప్రదించవచ్చు.
పేద, సన్నకారు రైతుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీని కింద అర్హులైన రైతులకి ఏటా రూ.6000 అందిస్తారు. అంటే రూ.2000 చొప్పున మూడు విడతలుగా అందిస్తారు. ఇవి రైతుల పెట్టుబడికి, ఇతర ఖర్చులకి అవసరమవుతాయి. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద పెట్టుబడికి డబ్బులు అందిస్తున్న సంగతి తెలిసిందే.