PM Kisan: పీఎం కిసాన్ 13వ విడత అప్‌డేట్.. వెంటనే ఈ పత్రాన్ని సమర్పించండి..!
PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 12వ విడత ఇటీవల రైతుల ఖాతాలకి చేరింది.
PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 12వ విడత ఇటీవల రైతుల ఖాతాలకి చేరింది. త్వరలో ప్రభుత్వం 13వ విడతను కూడా అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అయితే దీనికి ముందు రైతులు కొత్త నిబంధనలు పాటించాలి. లేదంటే 13వ విడత సొమ్ము వారి ఖాతాలోకి జమకాదు. దేశంలోని దాదాపు 8 కోట్ల మంది రైతులకు 12వ విడత డబ్బులు అందాయి. అదే సమయంలో 2 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఇంకా డబ్బులు జమ కాలేదు. ఇప్పుడు 13వ విడత డబ్బు చిక్కుకోకుండా ఉండాలంటే ముఖ్యమైన నియమాన్ని కచ్చితంగా పాటించాలి. దాని గురించి తెలుసుకుందాం.
రేషన్‌కార్డు సాఫ్ట్ కాపీ
రైతులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు రేషన్‌కార్డు సాఫ్ట్ కాపీని ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. దీనితో పాటు eKYC కూడా అవసరం. ఇది లేకుంటే రైతులకు 13వ విడత డబ్బులు జమకావు. ఇప్పటి వరకు రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, డిక్లరేషన్ ఫారమ్ హార్డ్ కాపీని సమర్పించాలి. ఇప్పుడు ఈ ప్రక్రియ ముగిసి కేవలం సాఫ్ట్ కాపీ మాత్రమే అడుగుతున్నారు. ఈ నిబంధనతో రైతుల సమయం ఆదా కావడంతోపాటు పారదర్శకత కూడా పెరుగుతుంది. చాలా మంది రైతులకు 12వ విడత డబ్బులు ఇంకా అందలేదని గుర్తుంచుకోండి.
హెల్ప్‌లైన్ నంబర్
పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092లో సంప్రదించవచ్చు. ఇది కాకుండా మీరు ఫిర్యాదును ఈ-మెయిల్ ఐడి (pmkisan-ict@gov.in)లో కూడా మెయిల్ చేయవచ్చు. మీ సమస్య గురించి అధికారులకి తెలియజేస్తే వారు పరిష్కరించే అవకాశాలు ఉన్నాయి. 12వ విడత అందని రైతులు ఇప్పుడే ఈ పనిచేయండి.