శాశ్వతంగా కలుపును నివారించే మార్గం
వసాయంలో రైతులకు ఆది నుండి అనేక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. అందులో కలుపు సమస్య ప్రధానమైంది.
వ్యవసాయంలో రైతులకు ఆది నుండి అనేక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. అందులో కలుపు సమస్య ప్రధానమైంది. కొన్ని రకాల కలుపు మొక్క జాతులు వేసిన పంటతో పాటు పోటీ పడి మరి పెరుగుతూ, పంట ఎదుగుదలకి అడ్డం పడుతుంటాయి. ఫలితంగా మొక్కలు పోషకాలు గ్రహించడంలో వెనుకపడి దిగుబడి పూర్తిగా తగ్గిపోతుండడంతో పాటు కలుపు తియ్యడానికి, కూలీలు, కలుపు యంత్రాలకు అదనంగా ఖర్చు, ఆర్ధిక భారం ఏర్పడుతుంది. దానికి తోడు కలుపు నియంత్రణకు మళ్లీ రసాయనాల బాట పట్టాల్సి వస్తుంది, అలాంటి కలుపు సమస్యలకు ముల్లును ముల్లుతోనే తియ్యాలన్న సామెతలాగ కలుపుని కలుపుతోనే అరికట్టవచ్చని ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తున్న మేడ్చల్ కి చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు అశోక్ కుమార్ పై నేలతల్లి ప్రత్యేక కథనం.
మేడ్చల్ కి చెందిన ప్రకృతి వ్యవసాయ నిపుణులు అశోక్ కుమార్ కొన్ని ప్రయోగాలు చేసి కలుపు మొక్కలతోనే కలుపు సమస్యకు మార్గమని అంటున్నారు, ప్రకృతి వ్యవసాయంలో కూడా ఒక్కోసారి కలుపు సమస్య రైతులను తీవ్రంగా వేధిస్తుంది ఎన్ని రకాల కషాయాలు వాడినా, కొన్ని జాతుల కలుపు బెడద మాత్రం తీరదు, ఆ క్రమంలో వాటి నివారణ కోసం నిషేదిత రసాయనాల వైపు మొగ్గు చూపుతున్నారు రైతులు. మన పొలంలోనే ఉండే కలుపు మొక్కలతో నివారణగా కషాయాలు తయారుచేసుకోవడం వల్ల రసాయనాలు వాడనవసరం లేకుండడంతో పాటు భూమిలో సూక్ష్మ జీవులకు కూడా ఎలాంటి హానీ కలగదని అంటున్నారు ఈ రైతు. ఆ వివరాలు ఏంటో అయన మాటల్లోనే తెల్సుకుందాం.
దారి పొడవునా గుంపులుగా , అవలీలగా పెరిగే ఎన్నో పిచ్చి మొక్కలను మనం చూస్తుంటాం, కానీ ఆ మొక్కలు వ్యవసాయ భూములలో పెరిగితే పంటకు ఎంత తీవ్ర నష్టం కలుగుతుందని మనకి అంతగా అవగాహన లేదు. అలాంటి కలుపు మొక్కలలో ఎన్ని రకలున్నాయో రైతులకు అవగాహన ఉండడం చాల అవసరం. మరి ఈ కలుపు జాతి మొక్కలు ఎన్ని ఉంటాయి? పంటలకు అవి ఏ విధంగా నష్టం కలిగిస్తాయి? ఆ వివరాలు ఇప్పుడు తెల్సుకుందాం.
ప్రకృతి సేద్యంలో నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి ఎన్నో సహజ కషాయాలని వాడుతుంటారు, కానీ కొన్ని జాతుల కలుపు మొక్కల మీద అవి ప్రభావం తక్కువ చూపిస్తుంటాయి, ఫలితంగా మళ్లీ కూలీలు, కలుపు తీసే యంత్రాలకు అదనపు ఖర్చులు మీద పడడంతో పాటు శాశ్వత నివారణ ఉండదని, పరిష్కారం కోసం కలుపు మొక్కలతోనే తయారుచేసిన ఘరలకంఠ కషాయం రైతులకు మేలు చేస్తుందని నిపుణులు అశోక్ కుమార్ అంటున్నారు. ఆ క్రమంలో కలుపు నివారణకు శాశ్వత మార్గాలు ఏమున్నాయి? కలుపు మొక్కలతో ఘరలకంఠ కషాయం తయారుచేసుకునే పద్ధతి ఎలా ఉంటుంది ? దాని వల్ల రైతులకు చేకూరే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.