ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం దొరకాలంటే ముందుగా ఆ సమస్య పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అందులో భూసమస్యల్లో ఇలాంటి అవగాహన చాలా అవసరం. భూవివాదాలు తలెత్తకుండా పూర్తి స్థాయి పరిష్కారాలు ఏర్పడాలంటే అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు, రైతులు కలిసి పని చేయాల్సి ఉంటుంది. అది మన భాద్యత కూడా. భూసమస్యలకి శాశ్వత పరిష్కార మార్గాలేంటో మనకు భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ తెలియజేస్తారు.
తెలుగు రాష్ట్రాలలో భూ ప్రక్షాళన చాలా అవసరం, భూవివాదాలు తలెత్తినా కూడా సత్వర పరిష్కారానికి ఉపయోగపడే వీలుగా ప్రభుత్వం, ప్రజలు కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఉమ్మడిగా ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి?
తెలుగు రాష్ట్రాల్లో భూముల సమస్యలు ఇప్పటివి కావు, ఈ సుదీర్ఘ సమస్యలు పరిష్కారానికి అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు సమన్వయం కావాల్సి ఉంటుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఉమ్మడి రాష్ట్రంగా ఆ తరువాత తెలుగు రాష్ట్రాల విభజన వరకు భూసర్వేలూ, ప్రక్షాళణలు పెద్దగా జరగలేదు. ఆ విధంగా భూపరిపాలన అనేది పూర్తిగా మరుగున పడిపోయింది, తద్వారా సమస్యలు, వివాదాలు పెరిగిపోయాయి. వీటి పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కొత్త చట్టాలని రూపొందించే దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే మరి ఈ భూ సమస్యలకి శాశ్వత పరిష్కారం కావాలంటే ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాల్సిన కీలక అంశాలు ఏంటి? అవి భూవివాదాల్లో ఎలాంటి పరిష్కారం చూపెడతాయన్న విషయాలపై భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ తెలియజేస్తారు.