గిత్తల పోషణకు నెలకు రూ.3 లక్షల ఖర్చు

దర్పానికి, రాజసానికి మారుపేరు మన ఒంగోలు జాతి గిత్తలు. రైతులు ఇవి తమ దగ్గరుంటే ఎంతో విలువైన ఆస్తి తమ దగ్గరున్నట్టు బావిస్తారు. నిలువెత్తు అందం, బలమైన దేహ దారుడ్యం, కష్టించి పనిచేసే మనస్తత్వం వీటి సొంతం.

Update: 2019-01-17 06:46 GMT
Seshadri Chowdary

దర్పానికి, రాజసానికి మారుపేరు మన ఒంగోలు జాతి గిత్తలు. రైతులు ఇవి తమ దగ్గరుంటే ఎంతో విలువైన ఆస్తి తమ దగ్గరున్నట్టు బావిస్తారు. నిలువెత్తు అందం, బలమైన దేహ దారుడ్యం, కష్టించి పనిచేసే మనస్తత్వం వీటి సొంతం. తెలుగువారి పశుసంపద విశిష్టతను ప్రపంచానికి వెలుగెత్తి చాటిన ఈ జాతి ఎద్దులు తెలుగింటికే గర్వకారణం. అలాటి వృషభ రారాజైన ఈ ఒంగోలు జాతి పశువులు ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకున్నాయి ఇలాంటి తరుణంలో కొందరు ఔత్సాహకులు ఎలాంటి లాభాలను ఆశించకుండా వీటిని పోషిస్తూనే ఉన్నారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు ప్రకాశం జిల్లాకు చెందిన రైతు పుచ్చకాయల శేషాద్రి చౌదరి.

ప్రకాశం జిల్లా నాగలుప్పలపాడు మండలం ముద్దిరాల ముప్పాళ్ల గ్రామానికి చెందిన రైతు పుచ్చకాయల శేషాద్రి చౌదరి. ఈయన గత 12 ఏళ్లుగా ఒంగోలు గిత్తలను పెంచుతున్నారు. ఒంగోలు గిత్తలంటే ఈ రైతుకు ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి వాటితో ఆడుతూ పాడుతూ పెరిగారు అందుకే ఎంతో ప్రేమతో చంటి పిల్లల్లా కంటికి రెప్పలా ఈ గిత్తలను కాపాడుకుంటున్నారు. ఈయన దగ్గర ప్రస్తుతం కోటి రూపాయలు విలువ చేసే 14 గిత్తలు ఉన్నాయి.

గిత్తల దినచర్యలు చూస్తే మనుషులు కూడా ముక్కన వేలేసుకోక తప్పదుమరి ఉదయం 6 గంటలకు లేస్తాయి ఎంచక్కా పాలు త్రాగుతాయి...వెంటనే 4 కిలోమీటర్ల వాకింగ్ మరియు జాగింగ్ చేస్తాయి. ఆ తర్వాత అలసిపోయిన గిత్తలు వేడినీటి స్థానం చేసి విశ్రాంతి తీసుకుంటాయి విశ్రాంతి పూర్తవ్వగానే వీటికి 12 గంటలకు ఉలవలుతో కూడిన దాణా రెడీగా ఉంటుంది మళ్లీ 3 గంటలకు ఖర్జూరాను తిని అలా సాయంత్ర మళ్లీ 4 గంటలకు వాకింగ్ చేస్తాయి ఇక 6 గంటలకు బెల్లం, నువ్వులు తో చేసిన ముద్దలు తింటాయి. ఇలా వీటికి పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచుతున్నారు శేషాద్రి చౌదరీ. ఎడ్ల పందేలు మాట వినపడగానే ఒంగోలు గిత్తలు గుర్తుకు వస్తాయి. అందుకే ప్రతీ ఏటా జిల్లాలో సంక్రాంతి పూట జరిగే ఎడ్ల పందేల్లో శేషాద్రి చౌదరి గిత్తలు పాల్గొనాల్సిందే జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రంలో ఎక్కడ పోటీలు నిర్వహించినా కచ్చితంగా పాల్గినాల్సిందే.

గిత్తల పోషణ అంటే ఆషామాషీ కాదు నెలకు సుమారుగా 3 లక్షల రూపాయలను వెచ్చిస్తున్నారు. వీటి పోషణ, సంరక్షణ బాధ్యతలను చూసుకునేందుకు 8 మంది కార్మికులు పనిచేస్తున్నారు వారికి ఏడాదికి అయ్యే ఖర్చు ఇంచు మించు 10 లక్షల పైనే. మరి ఇంత ఖర్చు పెడుతున్నా రైతుకు గిత్తలు తెచ్చిపెట్టే ఆదాయం మాత్రం సూన్యం

గిత్తల పెంపకం ద్వారా తనకు మానసిక ఉల్లాసంతో పాటు, సమాజంలో గ్రామంలో ప్రత్యేక మర్యాద దక్కుతోందంటున్నారు రైతు. ప్రపంచ దేశాలలో ఖ్యాతి సంపాదించిన ఒంగోలు గిత్తలు ప్రస్తుతం అంతరించి పోయే దశకు చేరుకునన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన తెలుగు జాతి ఖ్యాతిని చాటి చెప్పే ఈ వృశభరాజుల సంరక్షణకు ప్రభుత్వం చొరవ తీసుకుంటే బాగుంటుంది అని రైతులు అభిప్రాయ పడుతున్నారు.  

Full View

Similar News