PM Kisan: రైతులకి గమనిక.. పీఎం కిసాన్‌ పదకొండో విడత కోసం ఈ పని చేశారా..!

PM Kisan: PM కిసాన్ నిధి లబ్ధిదారులు 11వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈసారి లబ్దిదారుడు కేవైసీ చేయాలని కోరింది.

Update: 2022-04-27 07:43 GMT

PM Kisan: రైతులకి గమనిక.. పీఎం కిసాన్‌ పదకొండో విడత కోసం ఈ పని చేశారా..!

PM Kisan: PM కిసాన్ నిధి లబ్ధిదారులు 11వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈసారి లబ్దిదారుడు కేవైసీ చేయాలని కోరింది. దీంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు మీరు KYC పూర్తి చేయడానికి ఆధార్ సేవా కేంద్రాలను సందర్శించాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని కూడా KYCని పూర్తి చేయవచ్చు. దీని కోసం ఆధార్, మొబైల్ నంబర్‌ని లింక్ చేయాలి. ఇప్పటికే లింక్‌ అయి ఉంటే మొబైల్ లేదా ల్యాప్‌టాప్ నుంచి OTP ద్వారా e-KYC ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అయితే PM కిసాన్ పోర్టల్‌లో ఆధార్ ఆధారిత OTP ప్రమాణీకరణ కొన్ని రోజులు ఆపివేశారు. ఇప్పుడు మళ్లీ పునరుద్దరించారు.

మే 31లోపు e-KYCని పూర్తి చేయాలి

మీరు PM కిసాన్‌కి సంబంధించిన e-KYCని ఇంకా పూర్తి చేయకుంటే 11వ విడత ఆగిపోవచ్చు. PM కిసాన్ పోర్టల్‌లో ఆధార్ ఆధారిత e-KYC పునఃప్రారంభించారు. వాస్తవానికి ప్రభుత్వం e-KYC నియమాలను తప్పనిసరి చేసింది.

ఈ-కెవైసిని ఎలా పూర్తి చేయాలి

1. ముందుగా మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లో PM కిసాన్ వెబ్‌సైట్ (pmkisan.gov.in) ఓపెన్‌ చేయండి. ఇక్కడ కుడి వైపున e-KYC లింక్ కనిపిస్తుంది.

2. ఇక్కడ ఆధార్ (AADHAAR)తో లింక్ అయిన మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేసి సెర్చ్‌ బటన్‌పై నొక్కండి.

3. ఇప్పుడు మీ మొబైల్‌లో 4 అంకెల OTP వస్తుంది. ఇచ్చిన బాక్స్‌లో టైప్ చేయండి.

4. అలాగే మళ్లీ మీరు ఆధార్ ధృవీకరణ కోసం మరో బటన్‌ నొక్కండి. మళ్లీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కి 6 అంకెల OTP వస్తుంది. దాన్ని ఇచ్చిన బాక్స్‌లో నింపి ఓకె బటన్‌పై నొక్కండి.

5. తర్వాత మీ eKYC పూర్తవుతుంది లేదా కాలేదు అని వస్తుంది. ఇది జరిగితే మీరు ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించడం ద్వారా సరిదిద్దుకోవచ్చు. eKYC ఇప్పటికే పూర్తి అయితే మాత్రం పూర్తయింది అనే మెస్సేజ్‌ కనిపిస్తుంది.

అలాగే మే 1 నుంచి జూన్ 30 వరకు ప్రభుత్వం సామాజిక తనిఖీని నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ ఆడిట్‌లో అర్హులు, అనర్హుల గురించి తెలుస్తుంది. అన్ని వివరాలు గ్రామ సభ ద్వారా సేకరిస్తారు. దీని తర్వాత జాబితా నుంచి అనర్హుల పేర్లు తొలగిస్తారు. అర్హులైన వ్యక్తుల పేర్లు ఉంటాయి. అర్హులైన రైతుల బదిలీ అభ్యర్థన (RFT)పై రాష్ట్ర ప్రభుత్వాలు సంతకం చేశాయి. దీని తర్వాత FTO జనరేట్ అవుతుంది. ఆ తర్వాత లబ్ధిదారుడి ఖాతాలోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. 

Tags:    

Similar News