నిజామాబాద్ జిల్లా రైతుల్లో పెట్టుబడి దిగులు.. పంట పెట్టుబడి కోసం నానా తంటాలు

Nizamabad district farmers are worried over the investment: రైతులకు పెట్టుబడి దిగులు పట్టుకుంది. అన్నితట్టుకొని భూమిని నమ్ముకొని జీవిస్తున్న అన్నదాతకు రుణాల కష్టాలు తప్పడంలేదు.

Update: 2020-08-11 05:15 GMT

Nizamabad district farmers are worried over the investment: రైతులకు పెట్టుబడి దిగులు పట్టుకుంది. అన్నితట్టుకొని భూమిని నమ్ముకొని జీవిస్తున్న అన్నదాతకు రుణాల కష్టాలు తప్పడంలేదు. రుణాలు జారీలో బ్యాంకర్లు రైతులుకు చుక్కలు చూపిస్తున్నాయి. సకాలంలో అప్పులు ఇవ్వకపోవడంతో వడ్డీ వ్యాపారులను అశ్రయిస్తున్నారు. తీరని అప్పులు, ఎడతెగని సమస్యలతో నిజామాబాద్‌ జిల్లా రైతులు మదన పడిపోతున్నారు.

నిజామాబాద్ జిల్లాలో వానాకాలం పంటలు మొదలై రెండు నెలలు దాటినా పంట రుణాల పంపిణీ మాత్రం ఊపందుకోలేదు. ఈ దఫా రైతులు ముందే సాగు మొదలుపెట్టినా బ్యాంకుల నుంచి ఆశించిన స్థాయిలో రుణాలు అందడంలేదు. ఎరువులు, ఇతర అవసరాల కోసం వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 4లక్షల 30 వేల ఎకరాలలో వివిధ రకాల పంటలను సాగు చేశారు. ఎరువులు, కూలీలు, ఇతర ఖర్చుల నిమిత్తం రైతుబంధు కొంత ఊరటనిచ్చినా బ్యాంకుల నుంచి అవసరాలకు రుణాలు అందడం లేదని రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో ఇప్పటి వరకు 520 కోట్ల మాత్రమే రైతులకు రుణాలు పంపిణీ చేశారు. జిల్లాలో 2 లక్షల 37 వేల 953 మంది రైతులు ఉండగా 42 వేల 972 మంది రైతులకే రుణాలు ఇచ్చారు. రెండు నెలలు గడిచినా టార్గెట్‌కు అ నుగుణంగా రుణాలు ఇవ్వలేదు. పంట రుణాలు అందించడానికి ఒక్క నెలే గడుపు ఉండటంతో రైతులు బ్యాంకుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి రైతల కష్టాన్ని వడ్డీ వ్యాపారులు దోచుకోకుండా చూడాలని కోరుతున్నారు. కరోనా కష్టకాలంలో బ్యాంకర్లు మానవతా దృక్పథంతో ఆలోచించి రైతులకు అండగా ఉండాలని రైతన్నలు కోరుతున్నారు.

Tags:    

Similar News