వ్యవసాయంలో సరికొత్త సంస్కరణలు తీసుకువచ్చేందుకు కేంద్రం కొత్తగా మూడు వ్యవసాయ చట్టాలకు రూపకల్పన చేసింది. ఈ వ్యవసాయ చట్టం బిల్లులకు తాజాగా ఆమోదం లభించింది. మరికొద్ది వారాల్లో చట్టాలుగా రూపొందే మూడు వ్యవసాయ బిల్లులు, అనుబంధ వ్యవసాయ బిల్లులోని సవరణల అంశాల గురించి రైతులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒప్పంద సాగు పద్ధతి, దేశంలో పంటను ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు, నిత్యావర వస్తువుల సవరణలోని కీలక అంశాలేంటి ? ఈ చట్టాలు వ్యవసాయంపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి ?
ఏ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించైనా పంట వేయడానికి ముందే రైతు, కొనుగోలుదారుతో ఒప్పందం కుదుర్చుకునే వీలు కల్పిస్తూ ఒప్పంద వ్యవసాయ చట్టం తీసుకొచ్చింది కేంద్రం. మరి ఈ చట్ట ప్రకారం ఒప్పందం ఎన్నేళ్ల వరకు చేసుకోవచ్చు ? పంటకు ధరలు నిర్ణయించుకునే ఆధికారం రైతుకు ఉంటుందా ? ఒక వేళ ఒప్పందం జరిగి రైతు నష్టపోతే పరిష్కరించుకునేందుకు ఎవరిని సంప్రదించాలి ? సరిహద్దులతో సంబంధం లేకుండా దేశంలో ఎక్కడైన పంటను అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తూ... "రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార బిల్లు' - 2020"ని ప్రవేశ పెట్టింది కేంద్రం. ఈ నేపథ్యంలో సరిహద్దులు దాటి విక్రయించే వ్యవసాయ ఉత్పత్తులపై రాష్ట్రాలు కానీ, స్థానిక ప్రభుత్వాలు కానీ ఆంక్షలు ఏమైనా ఉంటాయ ? ఇతర ప్రాంతాల్లో పంట అమ్మకాలు జరిగే సమయంలో వివాదాలు ఏర్పడితే ఏం చేయాలి ? దేశంలో ప్రస్తుతం అమలులో నిత్యవసర సరకుల చట్టానికి కొన్ని సవరణలతో కొత్తగా తీసుకోచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ సవరణతో రైతులు, వ్యవసాయంపై ఎలాంటి ప్రభావం చూపనుంది? ధరలు, పంట నిల్వల నియంత్రణలో ఏమైనా మార్పులుంటాయా ? ఈ అంశాలపై నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం.
-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..