Weeder Machine: ఖమ్మం జిల్లా యువకుడి నూతన ఆవిష్కరణ
Weeder Machine: చేయాలనే తపన పట్టుదల ఉండాలే గానీ ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు.
Weeder Machine: చేయాలనే తపన పట్టుదల ఉండాలే గానీ ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు. రోజు రోజుకు వ్యవసాయంలో పెరుగుతున్న పెట్టుబడుల భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాడు. వ్యవసాయంలో తన తండ్రి కష్టాన్ని స్వయంగా చూసిన ఆ యువకుడు స్వశక్తితో కలుపుతీసే యంత్రాన్ని తయారు చేసి నలుగురుకి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇంతకి ఎవరా యువకుడు, ఏమా యంత్రం అనుకుంటున్నారా అయితే ఈ కథనాన్ని చూడాల్సిందే.
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్ద మండవ గ్రామానికి చెందిన నవీన్ మెకానికల్ డిప్లమో చదువుతున్నాడు. ఈ యువకుడిది వ్యవసాయ కుటుంబం కళ్ల ఎదుటే కన్నతండ్రి సాగు భారాన్ని మోయలేక పడుతున్న ఇబ్బందులు నవీన్‌ను ఆలోచింప చేసింది. ఆ ఆలోచనే నవీన్‌ను కొత్త ఆవిష్కరణలవైపు అడుగులు వేసేలా చేసింది. ఎకరం విస్తీర్ణంలో కలుపు తీసేందుకు పదుల సంఖ్యలో కూలీల అవసరం పడుతోంది. దీంతో నవీన్ తండ్రికి పెట్టుబడులు భారంగా మారాయి. దీంతో తన మెదడుకు పనిచెప్పి పాత ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసి అందుబాటులో ఉన్న పనికరాలతో కలుపుతీసే యంత్రాన్ని రూపొందించి అందరినీ ఆశ్చర్య పరిచాడు నవీన్.
ఎకరం విస్తీర్ణంలో కలుపు తీసేందుకు పదుల సంఖ్యలో కూలీలు అవసరం పడుతారు. ఒక్కో రోజుకు ఒక్కో రైతు కూలీకి మూడు నుంచి నాలుగు వందల వరకు చెల్లిస్తే తప్ప పనుల్లోకి రారు. అవసరమైన సమయంలో కూలీలు దొరకక కలుపు విపరీంతంగా పెరిగి దిగుబడులపై ప్రభావం చూపుతోంది. వీటన్నింటిని గమనించిన నవీన్ తన నాన్నతో పాటు తోటి రైతులు కష్టపడవద్దనే ఈ కలుపు యంత్రాన్ని రూపొందించానని నవీన్ చెబుతున్నాడు. ఈ యంత్రం సహాయంతో కేవలం 200 రూపాయల ఖర్చుతో ఎకరం పొలంలో కలుపు తీయవచ్చంటున్నాడు .
నవీన్ తయారు చేసిన యంత్రం పనితీరు బాగుండటంతో అతడి స్నేహితులు, అధ్యాపకులు అభినందిస్తున్నారు. భవిష్యత్తులో రైతుల కష్టాలను తీర్చేందుకు, సాగు ఖర్చులను తగ్గించేందుకు మరిన్ని నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చేడతానంటున్నాడు నవీన్.