కరువును తట్టుకొనే వ్యవసాయం ఇదేనని...

Update: 2019-02-25 08:08 GMT

అదొక బీడు పడ్డ అటవీ ప్రాంతం అక్కడంతా సాగుకు నోచుకోని నేలలే అయినా సరే ప్రకృతిని నమ్ముకున్నారు ఎలాంటి రసాయనాలు వాడలేదు ఎరువుల ఊసే లేదు ప్రకృతి విధానంలో చిరుధాన్యాల సాగు చేపట్టారు ఆ నలుగురు యువ రైతులు మరో నలుగురికి చిరుధాన్యాల ప్రముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నారు నల్గొండ జిల్లా, చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామంలో 30 ఎకరాల్లో మొదటి సారి ప్రయోగాత్మకంగా చిరుధాన్యల పంటను సాధారణ పద్ధతిలో పండిస్తూ విజయపథంలో దూసుకెళుతున్న నలుగురు యువరైతులపై ప్రత్యేక కథనం.

చినుకు కరువై సాగు బరువై అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతులు సాగు భారమై నిస్సహాయంగా ఆత్మహత్యల పాలవుతున్నారు. ఒకే పంట వేయడం ఖరీదైన విత్తనాలు ఏటా ఒకటికి రెండు, మూడు సార్లు కొనడం రసాయనిక ఎరువులు, పురుగుమందుల కోసం ఎంత వడ్డీకైనా సరే అప్పులు తెచ్చి డబ్బు ఎద పెట్టడం చివరికి అప్పులే మిగలడం ఆత్మహత్యల పాలవడం ఇదంతా ఆధునిక సేద్యంలో రైతుల దుస్థితి.

ఈ పరిస్థితి మారాలంటే రైతులు మన పూర్వపు పంటల సాగును చేపట్టాలి. అందుకోసం తమ వంతు కృషి చేస్తున్న నలుగురు యువరైతులు తక్కువ ఖర్చుతో వర్షాభావ పరిస్థుల్లోనూ పండే చిరుధాన్యాల సాగుపై తులకు అవగాహన కల్పించడమే కాదు సాగుకు అనుకూలం కానీ నేలలో సైతం చిరుధాన్యాలను పండించవచ్చని చూపించేందుకు నల్గొండ జిల్లా, చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామంలో ఓ మోడల్ ఫామ్‌ను నిర్మించారు విజయపథంలో దూసుకెలుతున్నారు.

పోటీ ప్రపంచంలో అందరికంటే మనమే ముందుండాలి ఎక్కువ సంపాదన ఉండాలన్న పట్టుదలతో నేటితరం సాగుతోంది. ఉరుకులు, పరుగులతో జీవనశైలి పూర్తిగా మారుతోంది. ఎక్కడపడితే అక్కడ, ఏది పడితే అది తినడంతో జబ్బులు కొనితెచ్చుకోవాల్సి వస్తోంది. గతంలో ఆహారంలో పోషకవిలువలు ఎక్కువగా ఉండే చిరుధాన్యాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ పంటలే కనుమరుగవుతున్నాయి. పోషకాల లోపంతో శరీరంలో రుగ్మతలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరుధాన్యాల సాగును చేపట్టాలని సంకల్పించుకున్నారు నర్సింహా, క్రాంతి కిరణ్ ,శ్యాంప్రసాద్ రెడ్డి, భాస్కర్.

గుండ్రాంపల్లి గ్రామంలో 30 ఎకరాల్లో 5 రకాల చిరుధాన్యాలను సాగు చేస్తున్నారు ఈ నలుగురు యువరైతులు. అది బీడు పడ్డ అటవీ ప్రాంతం. అక్కడ సాగు అనేదే లేదు. అయినా ఏం కంగారు పడలేదు ఆ ప్రాంతాన్నే సాగుకు అనుకూలంగా మార్చుకున్నారు. చిరుధాన్యాలను పండిస్తున్నారు.

ఎంతో కాలం పంటలను తమ తల్లిదండ్రులు రసాయనిక ఎరువలతోనే పండించేవారు. ఈ రసాయనాల ద్వారా ఈ నలుగురు గతంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు అస్సలు పరిచమే లేని ఈ నలుగురిని ప్రకృతి వ్యవసాయ గ్రూప్ కలిపింది. వీరి ఆలోచనలు ఏకమయయాయి. మొదటిసారి ప్రకృతి సాగులో బాగంగా వరి, కూరగాయలను పండించిన వీరు ప్రస్తుతం చిరుధాన్యాలను పండిస్తున్నారు.

పూర్తి స్థాయిలో ఎలాంటి పెట్టుబడి లేకుండా తక్కువ నీటితో రైతుకు లాభదాయంకగా వుండాలని... మొదట చిరుధాన్యాల సాగుపై అవగాహాన సదస్సులు నిర్వహించేవారు అయితే దీనిని ప్రయోగాత్మకంగా పది మంది రైతులకు చూపించే విధంగా ఓ మోడల్ ఫామ్ ను నిర్మిస్తే బాగుంటుందనే ఆలోచనతో ఈ పచ్చటి వనాన్ని కళ్లముందుకు తీసుకువచ్చారు. ఇదంతా ఒకప్పుడు అటవీ ప్రాంతం దాన్నే అనుకూలంగా మార్చుకుని ఆరోగ్యకరమై పచ్చటి పంటలు పండిస్తున్నామని చెబుతున్నాడు యువరైతు నర్సింహా

సరైన సమయంలో నీరు అందక చాలా మంది రైతులు పంటలను నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చిరుధాన్యాల సాగే మేలైన పంట అని చెబుతున్నారు ఈ యువరైతులు పంట వేసినప్పటి నుంచి ఇప్పటివరకు చేనుకు ఎలాంటి నీరు అందించలేదు వాటికమే ఎదుగుతూ వస్తున్నాయి ఎలాంటి ఎరువలు లేకుండా సాగు చేయడం వ్లల పంట చేనులో పక్షులు, నెమళ్ళు సరదాగా సంచరిస్తూ తమని పలకరిస్తుంటాయని చెబతున్నారు రైతులు.

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెరుగుతుండడంతో ఓ గ్రూప్ గా ఏర్పడి 1300 మంది రైతులను ఏకం చేసారు. పోషక విలువలు ఎక్కువగా వుండి తక్కువ నీటితో పండే చిరుధాన్యాలపై తెలుగు రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాలలో నెలకు రెండు సార్లు అవగాహాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రైతులు చిరుధాన్యాలతో పాటు మిశ్రమ పంటలు వేసుకుంటే మంచి లాభాలు సాధించవచ్చని క్రాంతి కిరణ్ అంటున్నారు.

చిరుధాన్యాలు పండించే రైతు లాభాలను సాధించవచ్చు ఇందుకు కారణం మార్కెట్‌లో వినియోగదారులకు కావలసిన ఉత్పత్తులు అందక, అనుకున్న స్థాయిలో చిరుధాన్యాల సాగు జరగక పోవటంతో వీటికి మరింత డిమాండ్ పెరుగుతుంది కాబట్టి రైతులు వీటిని పండించి అమ్ముకోకుండా ఈ చిరుధాన్యాలకు సంభందించి రైతులు గ్రూపులుగా ఏర్పడి చిన్న స్థాయిలో ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకుంటే మంచి లాభాలు వస్తాయి ఇక ఈ పంట కాలం కేవలం మూడు నెలలే కావడంతో సంవత్సరానికి 3 పంటలు వేసుకోవచ్చు నికర ఆదాయం సాధించవచ్చంటున్నారు శ్యాంప్రసాద్‌.

ఇప్పటికే భూములు భూగర్బ జలాలు లేక ఎండిపోయి బీడు భూములుగా మారిపోతున్నాయి మరో పక్క దేశవ్యాప్తంగా పోషకాహారం లోపం కూడా పెరిగిపోతుంది ఇందుకు చిరుధాన్యాల సాగే రైతుకు ప్రత్యామ్నాయంగా మారుతోంది మన పూర్వికులు ఈ చిరుధాన్యాలను తినే ఎంతో బలంగా వుండే వారు కానీ రాను రాను మన ఆహారపు అవవాట్లలో చాల మార్పులు వస్తున్నాయి 100 రకాల చిరుధాన్యాలలో ఇప్పుడు మనకు కొన్ని రకాలు మాత్రమే అందుబాటులో వున్నాయి. అందు కోసమే తమ 30 ఎకరాల భూమిలో పండిస్తున్న చిరుధాన్యాల విత్తనాలను రైతులకు ఉచితంగా అందించటానికి సిధ్దంగా వున్నామంటున్నారు భాస్కర్‌.

ఆహార భద్రత, పర్యావరణ భద్రత, జీవన భద్రతలను ఇచ్చేదే సంప్రదాయ చిరుధాన్యాల వ్యవసాయం. సంప్రదాయ పంటలు కరువు పరిస్థితులను అధిగమించి దిగుబడులిస్తాయి. అందుకే రైతులు మన పూర్వపు పంటలైన చిరుధాన్యాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Full View 

Similar News