Mushroom Cultivation: నిరుధ్యోగ యువతకు.. నికర ఆదాయం ఇచ్చే పంట..

Mushroom Cultivation: కరోనా క్రైసెస్‌ కారణంగా పట్టణంలో చేస్తున్న ఉద్యోగాన్ని వీడి సొంతూరు చేరుకున్నాడు గుంటూరు జిల్లాకు చెందిన సాయి.

Update: 2021-10-05 09:20 GMT

Mushroom Cultivation: నిరుధ్యోగ యువతకు.. నికర ఆదాయం ఇచ్చే పంట..

Mushroom Cultivation: కరోనా క్రైసెస్‌ కారణంగా పట్టణంలో చేస్తున్న ఉద్యోగాన్ని వీడి సొంతూరు చేరుకున్నాడు గుంటూరు జిల్లాకు చెందిన సాయి. ఉపాధి కోసం మరోసారి ఉద్యోగం చేయడం ఇష్టంలేక స్వయం ఉపాధి పొందాలన్న నిర్ణయానికి వచ్చాడు. వ్యవసాయ అనుబంధ రంగాలపై ఉన్న ఆసక్తితో తక్కువ పెట్టుబడితో లాభదాయకమైన ఆదాయం వచ్చే పాల పుట్టగొడుగుల పెంపకాన్ని మొదలు పెట్టాడు. ప్రస్తుత పరిస్ధితుల్లో ఏ వైరస్‌నైనా సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తి ఎంతో అవసరం అని వైద్యులు సూచిస్తుండటం పుట్టగొడుగులు పోషకాహారం అని ఆహార నిపుణుల సిఫార్సు చేస్తుండటంతో మార్కెట్‌లో పుట్టగొడుగులకు మంచి గిరాకీ ఏర్పడింది. ఆ గిరాకీనే అందిపుచ్చుకుని ప్రతి నెల నికర ఆదాయాన్ని పొందుతూ తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ యువరైతు.

పుట్టగొడుగుల పెంపకం ఇప్పుడు మంచి లాభాలు తెచ్చిపెట్టే కుటీర పరిశ్రమల జాబితాలో చేరింది. ఆహార నిపుణులు కూడా వీటి వాడకాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో పుట్టగొడుగులు సేద్యం లాభదాయకంగా మారింది. వీటిని పెంచినవారికి ఆదాయం తిన్నవారికి పౌష్టికాహారము లభిస్తాయనడంలో సందేహమే లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వీటకి మార్కెట్‌లో ఉన్న గిరాకీ దృష్ట్యా యువరైతులు పుట్టగొడుగుల పెంపకంవైపు ఆకర్షితులవుతున్నారు. తక్కువ పెట్టుబడితో నికర ఆదాయం వచ్చే అవకాశాలు ఉండటంతో స్వయంఉపాధి పొందేందుకు సాగువైపు కదులుతున్నారు. ఈ క్రమంలో కరోనా క్రైసెస్ కారణంగా గుంటూరు జిల్లా తెనాలి మండలం నందులపేటకి చెందిన సాయి గోపి హైదరాబాద్‌ లో తాను చేస్తున్న ఉద్యోగాన్ని వీడి సొంతూరు చేరుకున్నాడు. వ్యవసాయ అనుబంధరంగాలపై ఉన్న ఆసక్తితో పుట్టగొడుగుల పెంపకాన్ని మొదలు పెట్టాడు. తక్కువ పెట్టుబడితో ప్రస్తుతం ప్రతి నెల నికర ఆదాయం పొందుతున్నాడు.

కోత అనంతరం వచ్చే వరి గడ్డిపైనే పుట్టగొడుగుల పెంపకం జరుగుతుంది. అందుకే నాణ్యమైన గడ్డిని ఎన్నుకోవడం ఎంతో కీలకం అంటున్నాడు ఈ యువరైతు. అన్ని రకాల వరి గడ్డి సాగుకు అనుకూలం కాదంటున్నాడు. చీడపీడలు సోకని, కుళ్లిపోని తాజా గడ్డి పెంపకానికి అనుకూలమని చెబుతున్నాడు. అదే విధంగా సేకరించిన గడ్డిని శుభ్ర పరుచుకోవడంలో, నిల్వ చేసుకుకోవడంలో జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నాడు.

పుట్టగొడుగులకు ప్రత్యేకమైన సీజన్ అంటూ ఏమీ లేదు. ఇవి సంవత్సరం పొడవునా వస్తాయి. వీటికి పెద్దగా యంత్రాలు, పరికరాలు అవసరం లేదు. కొద్దిపొటి స్థలం ఉన్నా చాలు సరైన జాగ్రత్తలు పాటిస్తే చక్కటి దిగుబడి పొందవచ్చంటున్నాడు సాయి గోపి. రెండేళ్ల క్రితం రెండు లక్షల రూపాయల పెట్టుబడితో పెంపకం ప్రారంభించానని చెబుతున్న సాయి. ప్రస్తుతం ప్రతి రోజు 10 నుంచి 15 కేజీల పుట్టగొడుగుల ఉత్పత్తి సాధిస్తున్నానని హర్షం వ్యక్తం చేస్తున్నాడు. స్థానికంగానే కేజీకి 300 రూపాయల చొప్పున పుట్టగొడుగులను విక్రయిస్తూ ప్రతి నెల 40 వేల వరకు ఆదాయం పొందుతున్నానని చెబుతున్నాడు.

నిరుద్యోగ యువకులు నిస్సందేహంగా పుట్టగొడుగులను సాగు చేసుకోవచ్చునని సూచిస్తున్నాడు సాయి గోపి. అయితే ప్రారంభంలోనే అధిక పెట్టుబడులుపెట్టకుండా తక్కువ ఖర్చుతో పెంపకం ప్రారంభించాలంటున్నాడు. సాగుపై పూర్తి అవగాహన మార్కెట్‌లో పట్టు సాధించిన తరువాత దానిని విస్తరించాలంటున్నాడు.

Full View


Tags:    

Similar News