More Revenue Services in Online: రైతులకు వ్యవసాయంతో పాటు సాగు చేసుకునే భూములలోనూ అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అందుకే సాగుతో పాటు భూ సంభందిత చట్టాలపై అవగాహన ఎంతైనా అవసరం. చిన్న చిన్న భూ సంబంధిత అవసరాలకు రెవిన్యూ కార్యలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగే ఇబ్బందులను తగ్గించేందుకు ఆన్ లైన్ లో రెవిన్యూ సేవలు అందుబాటులో ఉన్నా వీటిపై అవగాహన లేని పరిస్థితి. ఈ క్రమంలో ఆన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్న సేవలు, వాటి వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల చట్టం-2011 స్థానంలో పంట సాగుదారుల హక్కుల చట్టాన్ని తీసుకొచ్చిందీ ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు చట్టబద్ధమైన ప్రయోజనాలు కల్పించడానికి 2019 అక్టోబర్ లో రూపొందించింది ఈ చట్టాన్ని. దీని ద్వారా సాగుదారుకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ? ఇందులో ఉన్న నియమ నిబంధనలు ఏంటి ? కౌలు రైతులకు ఎలాంటి భరోసానిస్తుంది ? ఆ వివరాలపై విశ్లేషణాత్మకంగా నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం.
-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..