సీజన్‌తో సంబంధం లేకుండా ఆకుకూరల సేద్యం.. తక్కువ పెట్టుబడితో లాభదాయకమైన ఆదాయం..

Leafy Vegetables Cultivation: మారిన పరిస్థితుల్లో వ్యవసాయం రైతుకు గుదిబండగా మారింది.

Update: 2022-12-16 07:46 GMT

సీజన్‌తో సంబంధం లేకుండా ఆకుకూరల సేద్యం.. తక్కువ పెట్టుబడితో లాభదాయకమైన ఆదాయం..

Leafy Vegetables Cultivation: మారిన పరిస్థితుల్లో వ్యవసాయం రైతుకు గుదిబండగా మారింది. సాగులో నష్టాలు, కష్టాలు సర్వసాధారణమయ్యాయి. అన్నదాతలు ఎప్పుడైతే సంప్రదాయ సాగు పద్ధతులను విస్మరించి రసాయనాలు, పురుగుమందుల వెంటపడ్డారో అప్పుడే వారికి ఇబ్బందులు మొదలయ్యాయి. పెట్టుబడి కొండంత..దిగుబడి, రాబడి మాత్రం గోరంతగా ఉండటంతో రైతులు తమ ఆలోచనదృక్పదాన్ని మార్చుకుంటున్నారు. ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్న, తోటి రైతులు పండిస్తున్న వరి, పత్తి వంటి పంటలను కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించడం మొదలుపెట్టారు. కూరగాయలు, ఆకుకూరలు వంటి పంటలను పండిస్తూ ఆర్థిక స్వాలంబన సాధిస్తున్నారు. ఆ కోవకే వస్తారు ఖమ్మం జిల్లాకు చెందిన రైతు సుధాకర్ రెడ్డి. గతంలో వరి, పత్తి వంటి పంటలు పండించి తీవ్ర నష్టాలను ఎదుర్కొన్న ఈ సాగుదారు ఆ కష‌్టనష్టాలను అదిగమించి సేంద్రియ పద్దతులను అనుసరిస్తూ ఆకుకూరలు పండిస్తూ లాభాలు బాటలో పయనిస్తున్నారు.

స్వేదం చిందించి సాగు చేసిన వరి, పత్తి, మిరప పంటలు ఆర్ధిక భరోసాను అందించలేదు. కష్టాలు నష్టాలే ఏళ్లుగా ఎదురయ్యయి. కారణం ఏమిటో గ్రహించాడు తోటి రైతులు పండించే పంటలు కాకుండా మార్కెట్‌లో డిమాండ్ ఉండే పంటల గురించి తెలుకున్నారు. అనుకున్నదే తడవుగా తనకున్న నాలుగు ఎకరాల భూమిలో ఆకుకూరల సేద్యం మొదలు పెట్టారు ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం కందుకూర్ గ్రామానికి చెందిన రైతు బండి సుధాకర్ రెడ్డి. ప్రారంభంలో తోటి రైతుల్లాగే పురుగుమందులు, రసాయన ఎరువులు వినియోగించి ఆకుకూరలు సాగు చేశారు రైతు. ఆ తరువాత వాటి వల్ల ఎదురయ్యే సమస్యల గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుని సేంద్రియ విధానాలవైపు అడుగులు వేశారు. గత 15 ఏళ్లుగా ఆకుకూరలు పండిస్తున్న సుధాకర్ రెడ్డి పదేళ‌్లుగా పూర్తి సేంద్రియ విధానాలనే అనుసరిస్తున్నారు. చక్కని దిగుబడులు సొంతం చేసుకుంటూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తూ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తూ ఊరిలో ఆదర్శ రైతుగా ఎదుగుతున్నారు.

4 ఎకరాలు భూమిలో కొత్తిమీర, తోటకూర, పుదీన, గోంగూర, పాలకుర, మెంతికూర వంటి విభిన్న రకాల ఆకుకూరలను సాగు చేస్తున్నారు సుధాకర్ రెడ్డి. ఆకుకూరల సాగుకు పూర్తి సేంద్రియ విధానాలనే అనుసరిస్తున్నారు ఈ సాగుదారు. ప్రారంభంలో సుభాష్ పాలేకర్ స్పూర్తి తో గో-ఆధారిత ఎరువులను పంటల సాగులో వినియోగించారు. అయితే ఈ పద్ధతిలో శ్రమ అధికంగా ఉండటంతో వేస్ట్ డీకంపోజర్‌ను వినియోగించారు. అయితే ఈ ఏడు కొత్తగా పురుగు సమస్య రావడంతో వేపకషాయంతో పాటు సీవీఆర్ పద్ధతిలో మట్టి ద్రావణాన్ని తయారు చేసుకుని పంటకు అందిస్తున్నారు. అదే విధంగా వడ్లు, గోధుమల మొలకలతో తయారు చేసిన ద్రావణాన్ని పంట ఎదుగుదలకు అందిస్తున్నారు. ఈ విధానాలు అనుసరించడం వల్ల నాణ్యమైన ఆకుకూరలను పొందగలుగుతున్నామని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆకుకూరలు చేతికి వచ్చిన తరువాత దళారులకు ముట్టజెప్పకుండా సొంతంగా ఆటో లో సత్తుపల్లి పట్టణానికి వెళ్లి స్వయంగా విక్రయిస్తున్నారు. రసాయనలు లేని ఆకుకూరలు కావడంతో . వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని రైతు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి రోజు 5 వేల రూపాయల విలువగల అకుకురాలను ఉత్పత్తి చేస్తున్నారు రైతు. కూలీలు ఆటో కర్చులు పోగ రోజుకి 2 వేలు వరకు లాభం దక్కుతోందన్నారు. నాణ్యమైన పంట దిగుబడి కేవలం సేంద్రియ సాగు ద్వారానే సాద్యం అవతుంది అని రైతు తెలిపారు. తోటి రైతులు ఈ విధానాలను అనుసరించాలని సూచిస్తు్న్నారు.

Full View


Tags:    

Similar News