మినీ ట్రాక్టర్ తయారీతో స్ఫూర్తిగా నిలిచిన కర్నూలు రైతు.. అర లీటర్ డీజిల్‌తో ఎకరం పొలం..

Farmer Kazamia: ఓ ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఓ ప్రయత్నం స్ఫూర్తిగా నిలుస్తుంది.

Update: 2021-12-20 07:11 GMT

మినీ ట్రాక్టర్ తయారీతో స్ఫూర్తిగా నిలిచిన కర్నూలు రైతు.. అర లీటర్ డీజిల్‌తో ఎకరం పొలం..

Farmer Kazamia: ఓ ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఓ ప్రయత్నం స్ఫూర్తిగా నిలుస్తుంది. కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతు ఇది నిజం చేసి చూపించారు. కష్టం, నష్టంతో మిలితం అయిన వ్యవసాయ రంగంలో అతడు చేసిన ఓ వినూత్న ప్రయత్నం ఇప్పుడు ఎందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది.

ఈ వ్యక్తి పేరు ఖాజామియా. కర్నూలు జిల్లా పాములపాడు మండలం తుమ్ములూరు గ్రామానికి చెందిన రైతు. ఆయనకున్న 18 ఎకరాల భూమే జీవనాధారం. 82 ఏళ్ల వయసులో ఆ భూమినే నమ్ముకుని ముందుకు సాగుతున్నాడు. వ్యవసాయం అంటేనే దుక్కిదున్నటం మొదలుకుని పంట మార్కెట్‌కు చేర్చి అమ్ముకునే వరకు రైతు నానావస్థలు పడాల్సిన పరిస్థితి. ఈ సమస్యలను అధిగమించి ముందుకు సాగాలని చేసిన ప్రయత్నం ఇప్పుడు ఎందరో రైతులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆయన వ్యవసాయం చేసే విధానంతో అందరిని ఆకట్టుకుంటున్నాడు.

పాత పద్ధతిలో వ్యవసాయం చేయటం కష్టంగా ఉందని గుర్తించిన ఖాజామియా ఓ వినూత్న ఆలోచన చేసాడు. మెకానిక్‌గా కూడా అనుభవం ఉండటంతో ఓ కొత్త పద్ధతిని కనుగొన్నాడు. అంతే ఓ పాత అప్పి ఆటో ఇంజిన్ కొని ముందు భాగంలో ఆటో టైర్లు, వెనుక భాగంలో ట్రాక్టర్ టైర్లు బిగించి మినీ ట్రాక్టర్‌గా మార్చేశాడు. దానితో పొలం దున్నటం, కలుపు తీయటం, కోతలు కోయటంతో పాటు ఇతర వ్యవసాయ పనులను ఇట్టే చేసేలా ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు.

తన భూమిలో ఈ మినీ ట్రాక్టర్ తోనే వ్యవసాయం చేస్తున్నాడు. దీంతో కూలీల ఖర్చులు, దుక్కి దున్నెందుకు ఎద్దుల సమస్య లేకుండా పోయింది. ఈ మినీ ట్రాక్టర్ తయారీ కోసం ఖాజామియాకు 70 వేలు ఖర్చు అయింది. ఇప్పుడు ఈ మినీ ట్రాక్టర్ పని తీరు అద్భుతంగా ఉంది. అర లీటర్ డీజిల్‌తో ఎకరం పొలం సునాయసంగా దున్నేస్తూన్నాడు. తోటి రైతులను ఆశ్చర్యపోయేలా చేస్తున్నాడు. వ్యవసాయంలో ఎదురయ్యే ఇబ్బందిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నాడు ఖాజామియా. ఇంధన ధరలు పెరిగినా ఈ మినీ ట్రాక్టర్ వినియోగించుకోవచ్చని, తక్కువ ఖర్చుతో వ్యవసాయం సాగించుకోవచ్చని ఖాజామియా నిరూపించి చూపుతున్నాడు.

Full View


Tags:    

Similar News