రైతు విజయరామ్ సూచనలతో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న పవన్ కల్యాణ్

Update: 2020-09-09 06:18 GMT

తిండి కలిగితె కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ కానీ ఇప్పుడా ఆ ఆహారం రసాయనాలతో విషమవుతుంది. అందుకే చాలా మంది ప్రకృతి వ్యవసాయం వైపు చూస్తున్నారు. మంచి ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యకరమైన ప్రజలుంటేనే దేశం బలంగా ఉంటుంది. ఇదే సత్యాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. ప్రకృతి వ్యవసాయం గురించి పరితపిస్తున్నారు.

రసాయన ఎరువులతో వ్యవసాయం చేయడం వల్ల ఆహారం విషతుల్యం అవుతుంది. అందుకే సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు పవన్ కల్యాణ్. భూమాతను సంరక్షించాలి మనం ఒక్కరమే కాదు జీవాలన్నీ బతకాలన్నది ఆయన ఆలోచన ఆ ఆలోచనే ఆయనను సేంద్రియ వ్యవసాయం చేయిస్తున్నది. వ్యవసాయం ఆదాయంతో పాటు విజ్ఞానమివ్వాలి. మానసిక ఆనందాన్ని కలిగించాలి. అందుకే పవన్ కల్యాణ్ ప్రకృతి వ్యవసాయం వైపు పరుగులు పెడుతున్నారు. ఆ ప్రయాణంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతు విజయరామ్ తరసపడ్డారు. ఆయన ద్వారా సుభాష్ పాలేకర్ విధానం పరిచయమైంది.

గోవుని ఎందుకు ఈ దేశంలో పూజిస్తాం. ఒక్క గోవుతో 30 ఎకరాలు ఎలా సాగు చేయవచ్చు విజయరామ్ వివరించారు. ఓ నమూనాతో స్వయంసమృద్ధితో వ్యవసాయంలో పుష్కలమైన లాభాలు పొందవచ్చని విజయరామ్ చెబుతున్నారు. రాజకీయాలకు సంబంధం లేకుండా తన వ్యక్తిగత ఆలోచనతో పవన్ కల్యాణ్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మనసారా ఆశీర్వదిద్దాం. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిద్దాం.

Full View


Tags:    

Similar News