మామిడి తోటలో...అంతర పంటలు

Update: 2019-01-24 05:53 GMT

కృష్ణా జిల్లాలోని నున్న ప్రాంతంలో వందలాది ఎకరాల్లో మామిడి సాగులో ఉంది. ఇక్కడ మామిడి సాగు ఎక్కువగా జరుగుతుంది రైతులు కేవలం మామిడి సాగుపైనే ఆధారడుతున్నారు. సీజన్‌ ఉన్న ఆ మూడు నెలలే రైతులు ఆదాయాన్ని పొందగలుగుతున్నారు. ఆ తరువాత పంట పొలం ఖాళీగా ఉండాల్సిందే రైతుకు రవ్వంత ఆదాయం కూడా దక్కడం లేదు పైపెచ్చు మామిడిలో సకాలంలో పూత నిల్వకపోవటం, అలాగే పిందె కూడా రాలడం వల్ల రైతులు నష్టపోతున్నారు. ఇదే విషయాన్ని గుర్తించిన రైతు శ్రీనివాస్‌ రెడ్డి మామిడిలో ప్రయోగాత్మక సాగును చేపట్టారు. ఆదేంటో తెలుసుకోవాలంటే ఓ సారి నున్నలోని అతని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించాల్సిందే.

కృష్ణా జిల్లా మిజయవాడ సమీపంలోని నున్న గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ రెడ్డి ఈయన మామిడిని సాగు చేస్తున్నారు మొదట రసాయనిక సేద్యంలో మామిడిని సాగు చేసేవారు. కేవలం సీజన్‌లోని 3 నెలలు మాత్రమే సాగుపైన దృష్టిపెట్టేవారు ఆ తరువాత ప్రకృతి సేద్యంపై అవగాహన పెంచుకుని ఈ రైతు మామిడి సాగులో తాను చేస్తున్న పొరపాట్లను తెలుసుకున్నాడు. మామిడి సాగులో స్థలం వృధాను గుర్తించి అందులో అంతర పంటల సేద్యం మొదలు పెట్టాడు అంతే కాదు పూర్తి ప్రకృతి సేద్యపు విధానాలను అనుసరిస్తున్నాడు అందరికీ వ్యవసాయం నష్టం తెస్తోందటారు రైతులు లాభాల్లేవంటారు మరి శ్రీనివాస్ రెడ్డి మాత్రం వ్యవసాయంలోనే ఆదాయముందంటారు అది రైతు ద్వారానే సాధ్యమంటున్నారు.

సాగులో ప్రత్యేక నీటి యాజమాన్య పద్ధతులను పాటిస్తున్నాడు ఈ రైతు. ఆరుతడి విధానంలో పంటలకు నీటిని అందిస్తున్నాడు. దీని వల్ల నీటి వృధాను అరికడుతున్నాడు. అంతే కాదు కలుపు సమస్యను నివారించేందుకు సహజ ఆచ్చాదన పద్ధతులను పాటిస్తున్నాడు. తద్వారా నేలలో తేమ శాతం నిలవడంతో పాటు సూక్ష్మజీవుల అభివృద్ధి జరుగుతుందని రైతు శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నాడు.

మామిడిలో అంతర పంటలుగా పసుపు , క్యారెట్‌, టమాట, మునగ, చిక్కుడు వంటి కూరగాలయతో పాటు తోటకూర, గోంగూర, వంటి ఆకుకూరలను పండ్ల చెట్లను ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు ఈ రైతు. అందులోనూ సాగు కోసం నాటు విత్తనాలను వినియోగిస్తున్నాడు. నాటు విత్తనాలను అభివృద్ధి చేసి వీటి సాగు విస్తీర్ణాన్ని పెంచాలని చూస్తున్నాడు రైతు శ్రీనివాస్ రెడ్డి.

ఆది నుంచి ప్రకృతి ధర్మాన్ని పాటించినప్పుడు మానవుడు సుఖంగా ఆనందంగానే జీవించాడు. ఎప్పుడైతే ప్రకృతిని మన అవసరాల కోసం దుర్వినియోగం చేయడం మొదలు పెట్టామో మానవ మనుగడ ఆరోజు నుంచి దుర్లభమవడం మొదలైంది. తాత్కాలిక అవసరాలకోసం ఆకస్మిక ప్రయోజనాల కోసం ప్రకృతిని నాశనం చేయడంతో అందమైన భవిష్యత్తును మానవుడే పాడు చేసుకుంటున్నాడు. అందుకే రైతులు రసాయనిక సేద్యాన్ని విడిచిపెట్టి తాతల కాలం నాటి మేటి సేద్యపు విధానాలవైపు అడుగులు వేయాలని సూచిస్తున్నాడు ఈ రైతు. మాటల్లో కాదు తాను ఈ ప్రయోగాత్మక సాగు ద్వారా పది మంది రైతుల్లో మార్పును తీసుకువచ్చే ప్రయత్నం చేస్తానంటున్నాడు ఈ రైతు.

ఆరుతడి విధానంలో సేద్యం సంప్రదాయ పంటలలో అంతర పంటలు వేయడం ప్రకృతి వ్యవసాయం కూరగాయల పంటల ద్వారా అదనపు ఆదాయం. ఒక్కటేంటి ప్రతీ విషయంలోనూ వైవిధ్యమే సాగులో లాభాలను పొందాలంటే రైతులు సాగు పద్ధతుల్లో మార్పును తీసుకురావాలంటున్నాడు రైతు శ్రీనవాస్ రెడ్డి. ఒకే పంట మీద ఆధారపడకుండా అంతర పంటల సాగు ద్వారా ఏడాది పొడవునా ఆదాయాన్ని రైతు పొందాలంటున్నారు. సాగులో ఆర్ధికంగా నిలిబడాలని సూచిస్తున్నాడు.

Full View

Similar News