రోజులు మారుతున్నాయి. అన్నీ కల్తీమయం అయిపోతున్నాయి. వ్యవసాయం రోజురోజుకూ కష్టతరమైపోతుంది. విత్తనాల దగ్గర నుంచి పురుగు మందుల దాకా అన్ని కల్తీ కావడం తో పాటు వేలాది రూపాయల ఖర్చు యాల్సిన పరిస్థితి వస్తోంది. దింతో వ్యవసాయం దండగ అనుకునే పరిస్థితికి మన రైతన్నలు చేరుకున్నారు. ఇందుకు భిన్నంగా సేంద్రియ వ్యవసాయంతో పంటల్ని పండిస్తూ అధిక ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో.సరికొత్త సమీకృత విధానం ద్వారా పంటల్ని పండించి దిగుబడులు సాధిస్తున్నారు.
జనాభా పెరుగుతున్న కొద్దీ తిండి గింజలకు సమస్య ఎకుక్వయిపోతోంది. ఆహార పదార్థ అవసరాలు ఎక్కువవుతున్నాయి. అవసరానికి తగ్గ పంటలు దిగుబడులు రావడం లేదు. భవిష్యత్తులో ఈ సమస్య మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉంది. మెం అవలంబిస్తున్న కొత్త సమీకృత విధానం ద్వారా ఒక పంట వేసే సమయంలో రెండు లేదా అంతకన్నా పంటల్ని పండిస్తున్నాము. ఈ విధానం మాకెంతో లాభదాయకంగా ఉందంటున్నారు మయంగ్బామ్ శ్యామ్చంద్ర మీటే. ఈయనకు ఈ విధానం ద్వారా పంటలు పండించడానికి చేసిన కృషికి గాను పలు అవార్డులు లభించాయి.
అంతేకాకుండా తన వ్యవసాయం లో ఎరువులుగా వాడుకోవడానికి గాను వర్మికల్చర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకున్నారు. సమీకృత విధానం అవలంబించడం ద్వారా నిలకడైన ఆదాయం సమకూరడంతో బాటు ప్రకృతి సహజ వనరులను కాపాడుకోగలుగుతామని ఆయన చెప్పారు. ప్రభుత్వం తనకు ఆర్ధిక సహకారాన్ని అందించిందని చెప్పారు. వర్మీ కంపోస్ట్ యూనిట్ ప్రారంభించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ట్యాంకు 15 వేల రూపాయల ఆర్ధిక సహకారాన్ని అందించిందన్నారు. అంతే కాకుండా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా తనకు సహకారం లభించిందని చెప్పారు.
సమీకృత విధానంలో వ్యవసాయంతో ఇపుడు మిజోరాం లో చాలా మంది రైతులు లబ్ది పొందుతున్నారు.