Fertilizer Gun: ఎరువులు వేసే గన్.. యువ రైతు ఆవిష్కరణ

Update: 2020-08-05 08:55 GMT

Fertilizer Gun: వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకొని తక్కువ ఖర్చుతో రైతులకు మేలు చేసే విధంగా సాగులో వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నాడు ఓ యువరైతు. కోతుల బెడదకు గతంలో మంకీ గన్‌ తయారు చేశాడు అదే ఉత్సాహంతో ఇప్పుడు ఫర్టిలైజర్ గన్ అనే మరో పరికరం తయారు చేశాడు. నూతన ఆవిష్కరణలతో ఆదర్శంగా నిలుస్తున్న నిజామాబాద్ యువ రైతు పై ప్రత్యేక కథనం.

నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలానికి చెందిన మహేష్ యువ రైతు తక్కువ ఖర్చుతో మేలు చేసే యంత్రంను తయారు చేసి అందరిని ఆకట్టుకొంటున్నాడు. ప్రస్తుతం వ్యవసాయ పనులన్నీ దాదాపు యంత్రాలతోనే చేస్తున్నారు. అయినా కొన్ని పనులకు కూలీల అవసరం తప్పడం లేదు. ప్రధానంగా యూరియా వేసే సమయంలో ఎకరానికి తప్పనిసరిగా ఐదుగురు కూలీలు అవసరమవుతున్నారు. ప్రస్తుతం కూలీల కొరత తీవ్రంగా ఉండడంతో ఈ సమస్యను అధిగమించేందుకు మరో సరికొత్త ఆలోచన చేశాడు ఈ యువరైతు.

ప్రస్తుతం నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. మొక్కజొన్న పంటకు యూరియా మందు వేయడానికి ఖర్చు, సమయం, శ్రమను లెక్కపెట్టిన మహేష్ రెడ్డి కేవలం మూడు వందల ఇరవై రూపాయల ఖర్చుతో యూరియా గన్ తయారుచేశాడు. ఈ పరికారనికి తయారుచేయడానికి ఒక సంచి, అర ఇంచ్ గల రెండు నుంచి మూడు పిట్ల పొడవు గల పైప్, ఇంచ్ క్లిప్పు, ఫిట్ పీవిసి పైప్, ఒక సాల్వ్0ట్ , రబ్బరు తో యూరియా ఫర్టిలైజర్ గన్ తయారు చేశాడు.

ఈ గన్ తో మొక్కజొన్న మొదల్లో పైపుకు ఉన్న ట్రిగ్గర్ ను నొక్కితే యూరియా మొక్కజొన్న మొదల్ల వద్ద పడుతుంది. ఈ గన్ తో నలుగురు చేయాల్సిన పనిని ఒక్కరే చేయవచ్చు అని మహేష్ రెడ్డి అంటున్నారు. గతంలో పంటలను కోతులు పక్షులు పందులు బారి నుంచి కాపాడేందుకు 500 ఖర్చుతో మంకీ గన్ తయారు చేశాడు. యువరైతు మహేష్ రెడ్డిని సోషల్ మిడియా వేదికగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అభినందించారు.

Full View



Tags:    

Similar News