శ్రీగంధంతో సిరులు

Update: 2019-06-05 13:29 GMT

సాగు ఖర్చులు గణనీయంగా పెరగడం, గిట్టుబాటు ధరలు లభించలేకపోవడం వల్ల రైతు నిత్యం కష్టాలతోనే కుస్తీపడుతున్నారు. అయినా సాగుకు దూరమవ్వకుండా ఆదాయం పెంచుకునేందుకు రైతులు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. ఖర్చులు తగ్గించి ఆదాయం పొందే పంటలను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉంది. నేడు అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఆర్జించే పంట శ్రీగంధం.

నల్లగొండ జిల్లా పస్నూర్ గ్రామానికి చెందిన రైతు విస్తారపు రెడ్డి. గత 50 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు అయినా లక్ష రూపాయాల బ్యాంక్ బ్యాలెన్స్‌ కూడా లేదు ఈ నేపథ్యంలో కష్టాల సాగును పక్కన పెట్టి గత 15 సంవత్సరాలుగా శ్రీగంధం సాగు చేస్తున్నారు. తన తోటలో పెరిగిన 18 చెట్లను అమ్ముకున్న ఈ రైతు అక్షరాల 6 క్వింటాళ‌్ల కలప దిగుబడితో 36 లక్షల రూపాయల ఆదాయం పొందారు. ఈ మొక్కల ద్వారా తన జీవితాంతం ఖర్చులకు సరిపోను ఆధానం లభించిందని రైతు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ప్రతీ రైతు శ్రీగంధం చెట్లను సాగు చేయాలని ఎకరం పొలంలో ఈ చెట్లను పెంచితే ప్రతి రైతు కోటీశ్వరుడు అవడుతాడంటున్నాడు.

శ్రీగంధం 15 సంవత్సరాలకు ఒక పంట వస్తుందని చాలా మంది రైతులకి అపోహ ఉంది. 15 సంవత్సరాల వరకు ఏ ఆధారం లేకుండా అవుతుందని బాధపడుతుంటారు శ్రీగంధం తోటలో కూడా అంతర పంటల సాగు చేసుకోవాచ్చు. వేరుశనగ, కూరగాయలు వేసుకోవచ్చు వీటితో పాటు పండ్ల చెట్లను నాటుకోవచ్చు.

నల్గొండ జిల్లా పెద్దాపురం గ్రామానికి చెందిన రైతు సిద్ధారెడ్డి. ఈయన తన 6 ఎకరాల్లో శ్రీగంధం సాగు చేస్తున్నారు ఎకరానికి 450 మొక్కలను నాటుకున్నారు. నర్సారావు పేట నుంచి మొక్కలు తీసుకువచ్చారు. సేంద్రియ పద్ధతుల్లో చెట్లను పెంచుతున్నారు. తోటి రైతులకు సాగు పట్ల అవగాహన కల్పిస్తున్నారు గతంలో పత్తి, మిర్చి వేసి నష్టాలను మూటగట్టుకున్నామని మిగులుబాటు లేదని చెబుతున్న ఈ రైతులు. సాగులో ఆర్ధికంగా లాభపడతామనే ఉద్దేశంతోనే శ్రీగంధం సాగు చేస్తున్నామంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఆత్మాభిమానం కలిగి ఉండే రైతులు అప్పుల్లో కూరుకుపోకుండా తెలివితో లాభాలను ఇచ్చే పంటలను సాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీగంధం చెట్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అధిక ధర పలుకుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో సేద్యానికి అనువుగా లేని భూముల్లోనూ ఈ చెట్లను పెంచడానికి అనుకూలంగా ఉంటుంది. పంట సాగుకు అయ్యే పెట్టుబడి అతితక్కువే. ఎరువుల అవసరం ఉండదు ఇతర మొక్కల వేర్ల నుంచి పోషకలు గ్రహించి పెరుగుతాయి. ఇలాంటి రకాల పంటల సాగును ప్రభుత్వాలు ప్రోత్సాహిస్తే రైతుకు మంచి లాభం దక్కుతుంది.  

Full View

Tags:    

Similar News