సమగ్ర సాగుతో యువరైతు ఆదర్శం

Update: 2020-09-22 05:09 GMT

సాగు లాభాల బాట కావాలంటే పెట్టుబడులు తగ్గించుకునే మార్గాలను అన్వేషించాలి. వ్యవసాయంలో అధిక పెట్టుబడులు పెరగడానికి రసాయన ఎరువులు, పురుగుమందులు కారణమవుతున్నాయి ఈ క్రమంలో పెట్టుబడులు తగ్గించుకుంటూ స్థానిక వనరులతో సాగు సాధ్యమయ్యేదీ ఒక్క ప్రకృతి వ్యవసాయంతోనే వీలు పడుతుంది. మిశ్రమ, సమగ్ర పంటల సాగుతో నిత్యం ఆదాయాన్ని పొందే మార్గాలు అనేకం. అదే కోవలో అంతర, మిశ్రమ విధానంలో కూరగాయల పంటలు సాగుతో పాటు లాభాదాయక ఆయిల్ పామ్ సాగును ప్రకృతి విధానంలో చేపడుతున్న అమ్మనాగుల పల్లి గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆదర్శ రైతు కమ్మ సత్యనారాయణపై ప్రత్యేక కథనం.

పశ్చిమ గోదావరి జిల్లా, అమ్మనాగుల పల్లి గ్రామానికి చెందిన రైతు కమ్మ సత్యనారాయణ గత ఏడేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. అంతకుమునుపు అందరి లాగానే సాధారణ రసాయన సాగు చేసేవాడు. స్థానిక అధికారుల సలహా, అదే విధంగా పాలేకర్ వ్యవసాయానికి ఆకర్షితుడై ప్రకృతి విధానంలో సాగు చేయడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా ప్రకృతి విధానంలో ఆయిల్ పామ్ సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అంతర, మిశ్రమ విధానంలో కూరగాయల పంటలు సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

సమగ్ర వ్యవసాయ పద్ధతిలో కూరగాయలు పండిస్తూనే ప్రకృతి విధానంలో ఆయిల్ పామ్ తోటలను కూడా సాగు చేస్తున్నాడు. 6 ఎకారాల్లో సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటలో అంతరపంటగా కొబ్బరిని సాగు చేస్తున్నాడు రైతు సత్యనారా‍‍‍యణ. అంతర, మిశ్రమ పంటలు రైతులకు ఎంతగానో లాభదాయకంగా మారతాయి. పెట్టుబడులను తక్కువ చేస్తూ ప్రధాన పంటతో పాటు అదనపు ఆదాయ వనరులుగా రైతులకు మేలు చేస్తాయి. ఆ విధంగానే తన పొలంలో అంతర, మిశ్రమ పంటలుగా పలు రకాల కూరగాయలు, తీగ జాతులను సాగు చేస్తున్నాడు ఈ రైతు.

అంతర, మిశ్రమ పంటలు రైతులకు ఎంతగానో లాభదాయకంగా మారతాయి. పెట్టుబడులను తక్కువ చేస్తూ ప్రధాన పంటతో పాటు అదనపు ఆదాయ వనరులుగా రైతులకు మేలు చేస్తాయి. ఆ విధంగానే తన పొలంలో అంతర, మిశ్రమ పంటలుగా బెండ, కాకారతో పాటు పలు రకాల కూరగాయలు సాగు చేస్తున్నాడు ఈ రైతు. తన పోలంలో పంటలకు చీడపీడల బెడదకు జీవామృతం, పంచగవ్య, వంటి ప్రకృతి కషాయాలని స్వయంగా తయారుచేసుకుని వాడతానని అంటున్నాడు.

రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తేూ తన పోలంలో మిశ్రమ పంటల విధానం అవలంభిస్తున్న రైతు సత్యనారా‍‍‍యణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది ఆదర్శ రైతు పురస్కారం అందించిందని అంతేకాకుండా తోటి రైతులకు ఉపయోగపడేలా పొలంబడి కార్యక్రమాలు తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తుందని తెలిపారు రైతు సత్యనారా‍యణ.

Full View


Tags:    

Similar News