ఆశాజనకంగా వాటర్ ఆపిల్ సాగు.. ఒక్కో చెట్టు నుంచి రూ. 6 వేల ఆదాయం

Water Apple: ఉద్యాన పంటల్లో వాటర్ ఆపిల్ సాగు ఆశాజనకంగా కనిపిస్తోంది.

Update: 2022-04-18 14:30 GMT

ఆశాజనకంగా వాటర్ ఆపిల్ సాగు.. ఒక్కో చెట్టు నుంచి రూ. 6 వేల ఆదాయం

Water Apple: ఉద్యాన పంటల్లో వాటర్ ఆపిల్ సాగు ఆశాజనకంగా కనిపిస్తోంది. ఈ పండు ఇప్పుడు రైతులకు లాభాలను తెచ్చిపెడుతోంది. వేసవిలో తాపం తీర్చి శరీరానికి మంచి పోషక విలువలు అందించే గులాబ్ జామ్ పంటను రైతులు ఉద్యాన పంటల్లో అంతర పంటగా సాగు చేస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంకు చెందిన రైతు ఈశ్వర్‌రావు కలకత్తా నుంచి ఐదు రకాల థైవాన్‌ వాటర్ ఆపిల్ మొక్కలను తెప్పించి సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం సీజన్ కావడం పండ్లు విరగకాస్తున్నాయి. ప్రతి రోజు ఈ పండ్ల అమ్మకం ద్వారా నికర ఆదాయాన్ని పొందుతున్నాడు .

వాటర్ యాపిల్, దీన్నే రోజ్ యాపిల్ లేదా గులాబీ యాపిల్ అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాల్లో ఇదే పండును బెల్ ఫ్రూట్ అని పిలుస్తారు. ఈ పండు ఎక్కువగా ఇండియా, ఇండోనేషియా, మలేషియాలో పండుతుంది. ఇది చూడటానికి అచ్చం జామపండులా ఉంటుంది. అలాగే బాగా పక్వానికి వస్తే గులాబీ రంగులో ఉంటుంది. కొన్ని పండ్లు పసుపు రంగులో, మరికొన్ని ఆకుపచ్చ రంగులోనూ ఉంటాయి. ఈ పండ్లు చాలా రుచికరంగా ఉంటాయి. అదే విధంగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఈ పండు ద్వారా లభిస్తాయి. వాటర్ ఆపిల్ పండ్లు ఎక్కువగా వేసవిలోనే లభిస్తాయి. కొత్త రకం పండు కావడంతో ప్రస్తుతం కాకినాడ జిల్లా రైతులకు లాభాలను తెచ్చిపెడుతున్నాయి. జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం వనఖండ్రవాడకు చెందిన రైతు ఈశ్వర్‌రావు వాటర్ యాపిల్ పెంచుతూ ప్రస్తుతం నికర ఆదాయాన్ని పొందుతున్నాడు.

గులాబ్ జామ్ మొక్కలకు ఎటువంటి సస్య రక్షణ చర్యలు చేపట్టవలసిన పని లేదంటున్నాడు రైతు. మందులూ , ఎరువులు వాడాల్సిన పనిలేదన్నాడు. విత్తనం వేసిన దగ్గరి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చీడపీడలు ఆశించలేదన్నారు. కేవలం నీరందిస్తే చాలు పండ్లు వాటంతట అవే పండుతాయని తెలిపాడు.

ఒక్కో చెట్టు నుంచి ఈ సీజన్‌లో అర టన్నుకు పైగా పండ్లు కాపుకు వస్తాయని రైతు చెబుతున్నాడు. ప్రస్తుతం కిలో 50 రూపాయల వరకు పండ్ల ధర పలుకుతోంది. ఒక్కో చెట్టు రోజుకు 10 కిలోల కాయలను ఇస్తోందని రైతు తెలిపాడు. మామిడి, కొబ్బరి తోటల్లో అంతర పంటగా వేయడం వల్ల అదనపు ఆదాయం లభిస్తోందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు.

గతంలో ఇతర ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన గులాబ్ జామ్ పండ్లు ప్రస్తుతం స్థానికంగా లభిస్తుండడంతో పలువురు కొనుగోలుదారులు పండ్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

Full View


Tags:    

Similar News