జామ తోటలో తేనెటీగల పెంపకం.. అదనపు ఆదాయం లభిస్తోందంటూ..

Honey Bee Farming: జామ తోటలో తేనెటీగల పెంపకం చేపట్టి స్వచ్ఛమైన తేనెను ఉత్పత్తి చేస్తున్నాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువరైతు.

Update: 2022-01-26 14:16 GMT

జామ తోటలో తేనెటీగల పెంపకం.. అదనపు ఆదాయం లభిస్తోందంటూ..

Honey Bee Farming: జామ తోటలో తేనెటీగల పెంపకం చేపట్టి స్వచ్ఛమైన తేనెను ఉత్పత్తి చేస్తున్నాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువరైతు. బీటెక్ వరకు చదువుకున్నా వ్యవసాయంతో స్వయం ఉపాధి పొందాలనే లక్ష్యంతో తనకున్న నాలుగు ఎకరాల్లో జామ తోటతో పాటు 20 పెట్టెలు ఏర్పాటు చేసి తేనెటీగలను పెంచుతున్నాడు ఈ సాగుదారు. జిల్లాలో నే మొదటి సారిగా ఈ యువరైతు కృత్రిమ తేనె ఉత్పత్తికి శ్రీకారం చుట్టాడు. లక్ష రూపాయల పెట్టుబడితో 15 రోజుల్లోనూ తేనెను ఉత్పత్తి చేస్తూ అదనపు ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నాడు.

ఖమ్మం జిల్లాలోని ముదిగొండ మండలం, ఖానాపురం గ్రామానికి చెందిన పోకల మురళి తనకున్న నాలుగు ఎకరల భూమిలో ప్రకృతి విధానంలో జామ తోటను సాగు చేశాడు. జామ తోటలో ఫలదీకరణ బాగుండేందుకు, అదనపు ఆదాయాన్ని పొందేందుకు తోటలనే లక్ష రూపాయల పెట్టుబడితో 20 పెట్టెలను వేరు వేరు చోట్ల ఏర్పాటు చేసుకుని తేనెటీగలను పెంచుతున్నాడు. కృత్రిమంగా తేనెను ఉత్పత్తి చేసినా పూర్తి సహజ విధానాలను అవలంభిస్తున్నాడు ఈ సాగుదారు నాణ్యమైన తేనెను ఉత్పత్తిని సొంతం చేసుకుంటున్నాడు. జిల్లాలో మొదటిసారిగా ఈ విధానానికి శ్రీకారం చుట్టానని యువరైతు చెబుతున్నాడు.

ఒక్కో పెట్టెలో 8 లైన్లు ఏర్పాటు చేసి, ఒక్కో ఫీడర్ ను ఉంచుతున్నాడు మురళి. ప్రతి పెట్టెలో తేనేటీగల ఆహారం కొరకు అరకిలో చక్కెర నీళ్లను ఉంచి, తేనేను మరో పెట్టెలో ఈగలు విడిచే విధంగా వ్యూహాత్మక ఆలోచన చేశాడు. మైనం తయారు చేసే తేనేటీగలు పెట్టెల నుంచి బయటకు రావు. మిగతా ఈగలు మాత్రమే బయటకు వెళ్లి ఆహారాన్ని తీసుకొచ్చి పెట్టే పనిలో ఉంటాయని రైతు చెప్తున్నాడు. ఒక్కో తేనే తుట్టె ద్వారా నాలుగు కేజీల తేనే తీస్తున్నాడు. అదనపు ఆదాయాన్ని పొందుతున్నాడు మురళి. ఇలాంటి వ్యూహాత్మక ఆలోచన చేసిన రైతుకు ప్రతి ఒక్కరు అభినందనలు తెలిపే పనిలో పడ్డారు.

Full View


Tags:    

Similar News