Software Engineer becomes Organic Farmer: సాఫ్ట్ వేర్ ని వదిలాడు.. సాగు దారిన నడిచాడు

Update: 2020-06-29 03:47 GMT

సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలాడు, సాగు బాట పట్టాడు నాలుగు రాళ్లు సంపాదించేందుకు పట్నమే వెళ్లాలా..? అనే సంశయాన్ని వదిలి, ఉన్న ఊల్లోనే కష్టపడితే అంతకంటే ఎక్కువే సంపాదించొచ్చని నిరూపిస్తున్నాడు నారాయణపేట జిల్లాకు చెందిన గట్టు అనిల్ అనే యువ రైతు. లాక్ డాన్‌ కారణంగా ఊర్లకు వచ్చేసిన ఎంతోమంది మళ్లీ సిటీకి వెళ్లాలా...? వద్దా..? అనే డైలామాలో ఉన్న వారికి ఆ యువకుడు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఉన్న ఎకరంలో 24 రకాల కూరగాయలు పండిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు.

Software Engineer becomes Organic Farmer: నారాయణపేట కేంద్రానికి చెందిన ఈ యువకుని పేరి గట్టు అనిల్.. అనిల్ కు రెండేళ్ల వయస్సప్పుడు తండ్రి దూరమయ్యాడు. దీమతో తల్లి ఎంతో కష్టపడి చదివించింది. దీంతో 2012 లోటు ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరాడు. అయితే రెండు సంవత్సరాల క్రితం సదరు కంపెనీ వారు బెంగళూరుకు ట్రాన్స్ ఫర్ చేయడంతో అనిల్ ఆలోచనలో పడ్డాడు. ఇంటి దగ్గర అమ్మను తనతో రమ్మంటే రానంది. దీంతో అమ్మను ఊళ్లో ఒంటరిగా ఉంచడం ఇష్టం లేక లక్షలు సంపాదించే ఉద్యోగాన్ని వదిలి ఊరికి వచ్చేశాడు. ఎంతముంది చెప్పినా, చివరకు తల్లి చెప్పినా వెళ్లలేదు. కొన్ని రోజులు ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ లో కంప్యూటర్ లెక్చరర్ గా పని చేశాడు. ఇటు జాబ్ చేస్తూనే వ్యవసాయం చేయాలనుకున్నాడు. అందులో కూరగాయలు పండించాలనుకున్నాడు. తనకున్న ఎకరం పొలంలోనే సేంద్రీయ వ్యవసాయానికి శ్రీకారం చుట్టాడు. తను పండించే కూరగాయల్లో కూడా ఏదో ఒక రకం మాత్రమే పండిస్తే దేనికి ఎప్పుడు ధర ఉంటదో, దేని ధర పడిపోతుందో అన్న కారణం చేత అన్నిరకాలు కూరగాయలు పండిస్తే నష్టమనేదే ఉండదని బావించాడు. ఏకంగా 24 రకాల కూరగాయలు పండిస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు.

దీంతో చుట్టుపక్కల ఊళ్లలోని రైతులు అనిల్ పొలానికి స్పెషల్ గా వస్తున్నారు. అనిల్ పొలంలో సాగు చేయని కూరగాయ లేదు. కొత్తిమీర, క్యారెట్, వంకాయ, బెండకాయ, తమాటో ముల్లంగి, బీర, పుండికూర, పాలకూర, మెంతికూర, మునగ, గుమ్మడి, ఆనగం కాయ, కాకరకాయ,చిక్కుడు,మీరప, దొండకాయ ఇలా అన్ని రకాల కూరగాయలతో పాటు అన్ని రకా పూలు కూడా సాగు చేస్తున్నాడు. అయితే వీటి సాగుకు రసాయనాలు పురుగు మందులు ఏవీ వాడదు. సేంద్రీయ పద్ధతిలోనే సాగుచేస్తున్నాడు. సైంటిస్టుల హెల్ప్ వ్యవసాయాన్ని రొటీన్ గా కాకుండా లాభాలు వచ్చేలా అందరికీ ఆదర్శంగా నిలిచేలా చేయాలనుకున్నానని అనిల్ అంటున్నాడు.

తను వ్యవసాయం ప్రారంబించే ముందు సైంటిస్టులను కలిసి భూసార పరీక్షలు చేయించాండు. వాళ్ళు చెప్పిన సలహాలు, సూచనలు పాటిస్తూ కూరగాయలు పండించడం మొదలు పెట్టాడు. పందులు, పక్షుల నుంచి పంటను కాపాడుకునేందుకు రకరకాలు సౌండ్స్ చేసే పరికరాలను పొలం చుట్టూ అమర్చాడు. ప్రస్తుతం అనిల్ చేస్తున్న వ్యవసాయానికి స్థానిక రైతులు ఆకర్శితులౌతున్నారు. లక్షలు సంపాదించే సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి దేశానికి అన్నం పెట్టే రైతన్న అవతారం ఎక్కిన గట్టు అనిల్ పలువురు యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.


Full View


Tags:    

Similar News