Flower Farming: సేద్యంలో రాణిస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

Flower Farming: మనిషి జీవనంలో కాలమాన పరిస్థితులు అనుభవాలు అవసరాలు కొన్ని కొత్త జీవన మార్గాలను చూపుతాయి.

Update: 2021-11-01 10:45 GMT

Flower Farming: సేద్యంలో రాణిస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

Flower Farming: మనిషి జీవనంలో కాలమాన పరిస్థితులు అనుభవాలు అవసరాలు కొన్ని కొత్త జీవన మార్గాలను చూపుతాయి. గతంలో ఏమోగానీ రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ఊహించని విధంగా కొన్ని జీవితాలను కకావికలం చేసింది. కరోనా కష్టకాలంలో ఎంతో మంది ఉద్యోగులు నిరుద్యోగులుగా మారారు. కొంత మంది ఉద్యోగులు ఇళ్లల్లోనే ఆఫీసు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడు అదనపు ఆదాయం పొందేందు నయా ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. వ్యవసాయంలో పూల బాటలు వేస్తూ తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఈ యువకుడి పేరు లీలా మోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలంలోని మారుమూల పల్లె అచ్చుకట్ల స్వగ్రామం. బీటెక్ వరకు చదువుకున్న లీలా మోహన్ రెడ్డి గతంలో చెన్నైలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అయితే కరోనా మహమ్మారి కారణంగా వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ ఇవ్వడంతో సొంతూరుకు చేరుకున్నాడు. ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ అదనపు ఆదాయం పొందాలన్న ఆలోచన లీలో మోహన్‌ మదిలో మెదిలింది. వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్న ఈ యువకుడు పూల సాగువైపు అడుగులు వేశాడు.

సంప్రదాయ వ్యవసాయంలో ఎదురవుతున్న ఇబ్బందులను గమనించిన లీలా మోహన్ నూతన సాగు పద్ధతులను అందిపుచ్చుకుని వాణిజ్య పంటల సాగు విధానం వైపు దృష్టి సారించాడు. పొలం కౌలుకు తీసుకుని గత ఏడాది వంగ సాగు చేశాడు. అందులో మంచి ఆదాయం లభించడంతో ప్రయోగాత్మకంగా బంతి సాగు చేపట్టాడు. బంతిలో అంతర పంటలతో పాటు గట్ల వెంబడి రక్షణ పంటలను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ప్రకృతి వైపరీత్యాల కారణంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడినా వాటిని తట్టుకుని నిలబడ్డాడు పండుగల సీజన్‌కు పంట వచ్చే విధంగా ప్రణాళికా ప్రకారం సాగు చేశాడు. ఇక ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో రైతు పంట పండినట్లైంది. బంతికి మార్కెట్‌లో మంచి ధర పలికడంతో ఈ యువరైతు ఉత్సాహం రెట్టింపైంది. అనుభవం లేకున్నా వ్యవసాయంలో అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తూ ఈ యువరైతు తోటి యువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

Full View


Tags:    

Similar News