Farmers Lost Rice Crops Due to Massive Floods : అధిక వర్షాలు, గోదావరి వరదలతో చేతికి అందాల్సిన పంట కాస్తా నీటి పాలయ్యింది. ఆరుగాలం కష్టపడి పండించుకున్న పంట చేతికి అందకపోయేసరికి రైతన్న దిగులు పడ్డాడు. సుమారుగా 7 వేల ఎకరాల్లో పంటలు కొట్టుకుపోవడంతో పంట నష్టంతో పెట్టుబడి ఎకరాకు సుమారు 25 నుంచి 30 వేలు రూపాయల పెట్టుబడి గోదావరి వరద వల్ల కన్నీళ్లు కష్టాలు మిగిలియని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక, రెడ్డి పాలెం, బంజరు, మోతే, ఇరవెండి, బూర్గంపాడు, తదితర ప్రాంతాల్లో ప్రత్తి, వరి, అపరాలు, కూరగాయల పంటలు సాగు చేస్తూ అధిక సంఖ్యలో రైతులు వ్యవసాయ రంగం పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎడతెరిపి లేని వర్షాలతో పాటు అనూహ్యంగా రైతు ఊహించని విధంగా గోదావరి వరద 2 సార్లు రావడంతో పంటలు మొత్తం నీటమునిగాయి. ఈ నేపద్యంలో రైతు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. వరద వచ్చి వెళ్ళిపోయింది పరవాలేదు కొంత పంటనైనా దక్కించుకుందమని ఆలోచించిన రైతుకు రెండోసారి గోదావరి వరద రావడం పంటలు నీట మునిగి పంట మొత్తం కుళ్లిపోయి నష్టం వాటిల్లింది. రైతులు ప్రస్తుతం వరద నష్టం వాటిల్లిందని తలలు పట్టుకుంటున్నారు.
ఎన్నో ఆశలు పెట్టుకునివ్యవసాయ రంగం పైనే జీవనాధారం ఉన్నటువంటి రైతులకు కష్టం గోదావరి వరద రావడంతో అయోమయంలో రైతు పడిపోయారు. ఈ నష్టానికి రైతులకు అగమ్యగోచరంగా పరిస్థితి ఏర్పడింది. మరికొన్ని రోజుల్లో మందులు చల్లి తర్వాత వచ్చినపంటలు సొంతం చేసుకుందామనుకునే క్రమంలో గోదావరి రెండు సార్లు రావడం పంట మొత్తం నీట మునిగికుళ్ళిన పంటలను చూసి రైతులుకు అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఆరుగాలం కష్టపడి పంట చేతికి వస్తుందని నమ్మకం ఉన్న ఈ సంవత్సరం గోదావరి రూపంలో అది కాస్తా రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. పంట పై ఆశలు పెట్టుకున్న రైతు అప్పులు తెచ్చి పంట సాగు చేసి అప్పులు తీరుస్తూ తన జీవనాధారాన్ని సాగించే ఈ క్రమంలో రైతుకువరద రూపంలో ఈ సంవత్సరం రెండుసార్లు పంట నీట మునిగి నష్టం వాటిల్లడంతో రైతన్న కన్నీరుమున్నీరవుతున్నారు. నష్టాన్ని ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలించి తమకు తమ కుటుంబాలకు న్యాయం చేయాలని తన ఆవేదన రైతు వ్యక్తం చేస్తూ ఉన్నాడు .రైతుకు అకాల వర్షాలతో నష్టం రావడం దురదృష్టకరంగా భావిస్తున్నారు. అకాల వర్షాలతో పాటు వరద రూపంలో తమ పంటనుకోల్పోయిన పరిస్థితి ప్రకృతి రూపంలో వచ్చిందని తన రైతు ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి పంటలను అంచనావేసి తక్షణమే రైతులకు సహాయం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.