ఆదర్శ రైతు.. అబ్బురపరిచే వ్యవసాయం

Update: 2020-11-03 09:19 GMT

నేల తల్లిని నమ్ముకున్నవారు పట్టుదలగా శ్రమిస్తే నష్టపోరని నిరూపిస్తూ రసాయనాలకు దూరంగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచి ఫలితాలు సాధించారు. కొత్త ఆలోచనలతో ఉద్యాన పంటలతోపాటు 25 రకాల కూరగాయలను సాగు చేస్తూ రాణిస్తున్నాడు ఆ రైతు, పాలిటెక్నిక్‌ డిప్లొమా చేసినా పుడమి తల్లిని నమ్ముకొని నాగలి పట్టి ప్రకృతి సాగులో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న వైఎస్సార్‌ జిల్లాకు చెందిన ఆకేపాటి వరప్రసాద్‌ రెడ్డిపై ప్రత్యేక కథనం.

వైఎస్సార్‌ కడప జిల్లా రాజంపేట మండలం హస్తవరంకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు ఆకేపాటి వరప్రసాద్‌ రెడ్డికి చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే బాగా ఇష్టముండడంతో చదువు పూర్తి కాగానే పై చదువులకు వెళ్లకుండా తన కుటుంబం కోసం వ్యవసాయం బాట పట్టాడు మొదట రసాయన వ్యవసాయం చేసాడు, నష్టాలను చవిచూసాడు తీవ్రంగా నష్టపోయినా మనోధైర్యంతో ముందుకు సాగి ప్రకృతి సాగులో విజయాలు సాధించాడు. సుభాష్ పాలేకర్ ప్రకృతి పాఠాలు, ‌HMTV నేలతల్లి ప్రకృతి వ్యవసాయ కథనాలు ఆయనకు స్ఫూర్తినిచ్చాయంటున్నారు.

రైతు ఆకేపాటి వరప్రసాద్‌ రెడ్డి అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. చదువు పూర్తి కాగానే పై చదువులకు వెళ్లకుండా తన కుటుంబం కోసం వ్యవసాయం బాట పట్టాడు రైతు వరప్రసాద్ రెడ్డి మొదట రసాయన వ్యవసాయం చేసాడు, నష్టాలను చవిచూసాడు తీవ్రంగా నష్టపోయినా మనోధైర్యంతో ముందుకు సాగి ప్రకృతి సాగులో విజయాలు సాధించాడు. అంతేకాకుండా ఆదర్శ రైతుగా ఆవార్డులూ అందుకున్నాడు.

తనకు వచ్చిన అనారోగ్య సమస్యతో డాక్టర్ల వద్దకు వెళ్ళాడు పంటలకు వినియోగించే రసాయనిక ఎరువులే సమస్యకు కారణమని డాక్టర్‌ చెప్పడంతో, ఆ క్రమంలోనే ప్రకృతి వ్యవసాయం చేయాలన్న ఆలోచన వచ్చిందని, అప్పటి నుండీ పంటలకు రసాయనిక ఎరువులు వాడకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాని అంటున్నాడు రైతు వరప్రసాద రెడ్డి. 2000 సంవత్సరంలో కడుపులో మంట సమస్యతో డాక్టర్‌ ను సంప్రదించాడు, రసాయనిక ఎరువులే ఆనారోగ్యానికి కారణమని డాక్టర్‌ చెప్పడంతో పంటలకు రసాయనిక ఎరువులు వాడకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాడు రైతు వరప్రసాద రావు. దేశీ ఆవులు ఉండటంతో ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నాడు.

ప్రకృతి వ్యవసాయంలో లాభాలను కలిగించే పద్ధతి మిశ్రమ, అంతర పంటల విధానం. ప్రధాన పంటగా మూడు ఎకరాల్లో జామను సాగు చస్తూ మిశ్రమ సాగును అవలంభిస్తున్నాడు ఈ రైతు. అదే విధంగా అంతరపంటలుగా పసుపు, కంద, మునగ వంటి పంటలతో అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ప్రకృతి సాగు విధానంలో కొత్త పద్ధతులను అనుసరిస్తూ సాగు చేస్తున్నారు రైతు వరప్రసాద్. పలు ప్రాంతాల్లో మేలైన వ్యవసాయ పద్ధతులను అభ్యసించి, తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటను సులువుగా సాగు చేసే డ్రిప్ విధానాలను అనుసరిస్తున్నారు. దాంతో పంట దిగుబడులు పెరిగాయని అంటున్నారు రైతు వరప్రసాద్. 

Full View


Tags:    

Similar News