తక్కువ నీటితో.. అధిక దిగుబడి
రైతులు ప్రాంతాన్ని బట్టి సాగుకు అవసరమయ్యే వనరులను బట్టి పంటల సాగు చేయాలి అప్పుడే రైతు అనుకున్న ఆదాయాన్ని పొందగలుగుతాడు.
రైతులు ప్రాంతాన్ని బట్టి సాగుకు అవసరమయ్యే వనరులను బట్టి పంటల సాగు చేయాలి అప్పుడే రైతు అనుకున్న ఆదాయాన్ని పొందగలుగుతాడు. అదే చేసి చూపిస్తున్నాడు అనంతపురం జిల్లా రైతు గతంలో సాగులో నష్టాలను చవి చూసిన ఈ రైతు నేడు బోరుబావి కింద రెండు ఎకరాల్లో అనప సాగు చేస్తున్నాడు. తక్కువ పెట్టుబడితో అనపను పండిస్తున్నాడు లాభదాయకమైన ఆదాయం వైపు అడుగులు వేస్తున్నాడు. ఆ వివరాలు మీకోసం.
అనంతపురం జిల్లా ఓ.డి.చెరువు మండలం ఉంట్లవారిపల్లెకి చెందిన రైతు మహేష్ రెడ్డి గతంలో ఎన్నో పంటలను సాగు చేసాడు ఈ రైతు అయితే అందులో లాభాలకంటే నష్టాలనే అధికంగా చవిచూసాడు. అయినా సాగులో వెనుకడుగు వేయలేదు తనకున్న బోరుబావి కింద రెండు ఎకరాల్లో అనప పంట సాగు చేపట్టాడు. అదీ తక్కువ పెట్టుబడితో పంటను పండిస్తున్నాడు.
కరవు ప్రాంతం కావడంతో తనకున్న బోరుబావి నుంచి వచ్చే నీటిని సమర్థవంతంగా వినియోగించుకున్నాడు డ్రిప్ పద్ధతి ద్వారా పంటకు నీరును అందజేస్తున్నాడు. దీంతో పంటకు సమృద్ధిగా నీరు అందుతోంది పంట కూడా ఏపుగా పెరుగుతోంది. చేనంత పచ్చగా కళకళలాడుతోంది.
మొత్తం రెండెకరాల పంట సాగుకు రైతు 20 వేల రూపాయల పెట్టుబడి పెట్టాడు. ఇప్పుప్పుడున్న మార్కెట్ ధరలను పోల్చుకుంటే పెట్టుబడి పోను పంట మొత్తం చేతికొస్తే తనకు దాదాపు 2 లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తుందని రైతు మహేష్ చెబుతున్నాడు. ఇదే గ్రామానికి చెందిన రైతు రామచంద్రా రెడ్డి కూడా తనకున్న ఎకరా పొలంలో అనప పంట సాగు చేసాడు. మంచి దిగుబడిని సాధిస్తున్నాడు. సంక్రాంతికి పంట చేతికి వస్తుందంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు.