ఉద్యోగం వదిలి డ్రాగన్ ఫ్రూట్ పెంపకం

Update: 2020-11-16 07:23 GMT

వర్షాలు ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఆ పంటకి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఒక్కసారి నాటితే స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. పండించిన వారికి లాభాలు, తిన్నవారికి ఫోషకాలనిస్తుంది అదే డ్రాగన్ ఫ్రూట్. ఈ కొత్త రకం పండును పండించాలనే ఆసక్తితో ఉద్యోగాన్ని సైతం వదులుకొని మరీ సాగు చేస్తున్నాడు నల్లగొండ జిల్లాకు చెందిన అజేందర్ రెడ్డి అనే యువరైతు. డ్రాగన్ ఫ్రూట్ సాగులో రాణిస్తున్న యువరైతుపై ప్రత్యేక కథనం.

డ్రాగన్ ఫ్రూట్ ఒక్కసారి నాటితే చాలు. 30 ఏండ్ల వరకూ మంచి దిగుబడినిస్తూ స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. అమెరికా, చైనా వంటి దేశాల్లో పండే ఈ పంటకు తెలంగాణలోనూ అనువైన వాతావరణం ఉంది. ఇక వర్షాలు ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా చెట్టుకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అలాంటి ఈ పంటను సాగు చేస్తున్నాడు నల్లగొండ జిల్లాకు చెందిన గూడురు అజేందర్ రెడ్డి అనే యువరైతు.

రైతు అజేందర్ రెడ్డి డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ముందు ప్రముఖ కంపెనిలో ఉద్యోగం చేసేవాడు ఉద్యోగ రిత్యా విదేశాలకు తిరిగేవాడు, ఆ సమయంలోనే డ్రాగన్ ఫ్రూట్ కి ఆకర్షతుడయ్యాడు. ఎలాగైనా సాగు చేయాలని డ్రాగన్ ఫ్రూట్ వివరాలు, సాగు విధానం తెలుసుకొని పెంపకం మొదలుపెట్టాడు. ఇందుకోసం ఉన్న ఉద్యోగం కూడా వదులుకున్నాడు.

డ్రాగన్ ఫ్రూట్ లో అమేరికన్ బ్యూటి రకాన్ని పండిస్తున్నాడు రైతు అజేందర్ తక్కువ చీడపీడల బెడద ఉంటుందనీ ఒక్కసారి నాటితే చాలు, 30 ఏండ్ల వరకూ మంచి దిగుబడినిస్తూ స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుందని అంటున్నాడు. వాతావరణంలో ఎలాంటి పంట దెబ్బతినదని ప్రారంభంలో కాస్త ఖర్చైనా దీర్ఘకాలీక లాభాలను అందిస్తుందని అంటున్నాడు రైతు అజేందర్ రెడ్డి.

డ్రాగన్‌ ఫ్రూట్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే, అన్ని రకాల ఔషధ గుణాలూ కలిగిన ఫలం ఇది. ఇందులో ఐరన్‌, విటమిన్‌-సి, ఫాస్పరస్‌, కాల్షియంలతోపాటు అనేక పోషక విలువలు ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇప్పుడిప్పుడే ఈ పండు గురించి ప్రజలకు తెలుస్తుండటంతో భవిష్యత్‌లో మరింతగా డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది.

Full View


Tags:    

Similar News