Covid Effect: పూల రైతులకు కరోనా కాటు

Covid Effect: ఒకప్పుడు పూల సాగు రైతులకు సిరులు కురిపించింది. కానీ ఇప్పుడు ఆ పూలే వారికి నష్టాలు మిగుల్చుతోంది.

Update: 2021-05-14 09:22 GMT

Covid Effect: పూల రైతులకు కరోనా కాటు

Covid Effect: ఒకప్పుడు పూల సాగు రైతులకు సిరులు కురిపించింది. కానీ ఇప్పుడు ఆ పూలే వారికి నష్టాలు మిగుల్చుతోంది. కారణం కరోనా. అవును. కర్ఫ్యూ, లాక్​డౌన్​తో పూలసాగు చేసిన రైతుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. పెళ్లిలు, పేరంటాలు లేక పూల వినియోగం తగ్గిపోయయి. కరోనా మహమ్మారి ఉద్ధృతితో ప్రజలు వివాహాలతో పాటు అన్ని రకాల శుభకార్యాలు వాయిదా వేసుకున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజులు చేసుకోవడం లేదు. అవసరమైతే తప్ప ఎవరూ మార్కెట్​కు రావడం లేదు. దీంతో పూల వ్యాపారం కనిష్ఠ స్థాయికి పడిపోయింది.

ఏపీలోని కుప్పం ప్రాంతం హార్టికల్చర్‌కు పెట్టింది పేరు. అక్కడి రైతుల్లో ఎక్కువ శాతం మంది పలు రకాల పూలను పండిస్తారు‌. మూడు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం కావడంతో వాటిని పలు రాష్ట్రాలకు విక్రయించే వారు. ఇప్పుడు కర్ణాటక, తమిళనాడులో లాక్ డౌన్ ఉండటంతో పూల రైతులకు ఎగుమతులు ఆగిపోయాయి. స్థానిక పూల వ్యాపారులు కూడా రైతుల నుంచి పూలు కొనుగోలు చేయడం లేదు. రైతులు బలవంతంగా అమ్మాలని చూస్తే ధరలో భారీ కోత పెడుతున్నారు.

పూలను మార్కెట్‌కు తెచ్చిన రైతులు రోడ్లపై పెట్టుకుని విక్రయించే ప్రయత్నం చేశారు. అయితే వ్యాపారులు రైతులను అడ్డుకున్నారు. మండీలు పెట్టుకున్న తమను కాదని వ్యాపారం చేయడం కుదరదంటున్నారు. ఈ హఠాత్పరిణామంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. మేము పండించిన పంటను రోడ్డుపై అమ్ముతుంటే మార్కెట్ వారికి సంబంధమేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. తమపై వ్యాపారుల దౌర్జన్యం ఏంటని నిలదీస్తున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Full View


Tags:    

Similar News