లండన్‌లో ఉద్యోగం... లాక్‌డౌన్‌లో స్వదేశానికి తిరిగు ప్రయాణం. ఇక ఇక్కడే సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని తలిచాడు మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు. ఆ క్రమంలోనే విదేశాల్లో బ్రతకడం కంటే స్వదేశంలో స్వశక్తితో సంపాదిస్తూ ముర్రా జాతి గేదెల పెంపకంతో తనతో పాటు నలుగురికి ఉపాధిని కల్పిస్తున్నాడు గోగుల భరత్ యాదవ్, భార్య, కుటుంబ సహకారంతో పాడి పరిశ్రమ రంగంలో రాణిస్తున్నాడు.
మహబూబాబాద్ జిల్లా వావిలాల గ్రామానికి చెందిన గోగుల భరత్ ఉపాధి కోసం లండన్‌లో ఉద్యోగం చేసేవాడు. కరోనా సమయంలో విధించిన లాక్డౌన్ వలన దేశానికి తిరిగి వచ్చిన భరత్.. సొంత ఊరిలో ఏదైనా ఉద్యోగం చేసుకుందామనుకున్నాడు. అయితే దానికి బదులుగా తన సొంత భూమిలో ముర్రా జాతి గేదెలతో పాడి వ్యపారం మొదలు పెట్టారు. పాడి పరిశ్రమలో తాను ఉపాధి పొందడమే కాకుండా తనతో పాటు నలుగురికి ఉపాధిని కల్పిస్తున్నారు.
-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..